Training FBOs: కడెం అడవుల్లో శిక్షణ ఎఫ్‌బీవోలు
Sakshi Education
కడెం: హైదరాబాద్ దూలపల్లి అటవీ అకాడమీకి చెందిన 45 మంది శిక్షణ ఎఫ్‌బీవోలు జూలై 30న కడెం అడవుల్లో పర్యటించారు.
మండలంలోని ఉడుంపూర్ అటవీరేంజ్ పరిధిలోని కల్పకుంట వాచ్ టవర్‌ను సందర్శించి, గడ్డి క్షేత్రాలను పలు అభివృద్ధి పనులను పరిశీలించారు.
చదవండి: India in Third Place : అటవీ విస్తీర్ణంలో మూడవ స్థానంలో నిలిచిన భారత్..
కల్లెడ డెప్యూటీ రేంజ్ అధికారి డి.ప్రకాశ్ వారికి సహజ, కృత్రిమ పద్ధతులతో గడ్డి క్షేత్రాల పెంపకం, అటవీ ప్రాంతంలో పక్షల రకాలను గురించి వివరించారు. ఎఫ్‌బీవో ప్రసాద్ గడ్డి జాతులు, వాటి పేర్లను వివరించారు. వారి వెంట అసిస్టెంట్ కోర్సు డైరెక్టర్ (ఏసీడీ) సుభాష్, అటవీశాఖ సిబ్బంది ఉన్నారు.
Published date : 31 Jul 2024 03:38PM