Free Training: రీజనింగ్‌తో పోటీ పరీక్షల్లో విజయం
Sakshi Education
కామారెడ్డి అర్బన్: అర్థమెటిక్, రీజనింగ్‌లో ప్రావీణ్యం ఉంటే విద్యార్థులు పోటీ పరీక్షల్లో సులభంగా విజయం సాధించే అవకాశం ఉంటుందని కామారెడ్డి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ కె.కిష్టయ్య అన్నారు.
కళాశాలలో టాస్క్, టీఎస్‌కేసీ సంయుక్త ఆధ్వర్యంలో తృతీయ సంవత్సరం విద్యార్థులకు రెండు రోజుల పాటు నిర్వహించిన అర్థమెటిక్, రీజనింగ్ శిక్షణ తరగతులు ఆగస్టు 23న ముగిశాయి. సాధారణ విద్యతో పాటు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దడానికి ఈ తరగతులు నిర్వహిస్తున్నట్టు శిక్షకుడు రఘుతేజ అన్నారు. సమన్వయకర్త ఫర్హీన్ ఫాతిమా, మెంటర్ అజారుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
చదవండి: కరెంట్ అఫైర్స్ | ఏపీపీఎస్సీ | టీఎస్‌పీఎస్సీ | ఏపీ పోలీసు | టీఎస్ పోలీసు | టెట్ | ఏపీ టెన్త్ క్లాస్ | టిఎస్ టెన్త్ క్లాస్ | ఉద్యోగాలు | ఏపీ ఇంటర్ | టిఎస్ ఇంటర్ | ఎంసెట్ | భవిత | ప్రివియస్ పేపర్స్
Published date : 24 Aug 2023 01:11PM