TNPSC Group 1 Mains Results: గ్రూప్ –1 మెయిన్స్ ఫలితాల విడుదల
ఇందులో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు మార్చి 26,27,28 తేదీలలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. వివరాలు.. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఖాళీగా ఉన్న 18 సబ్ కలెక్టర్, 26 డీఎస్పీ, 13 సహకార సంఘాల రిజిస్టార్, 25 వాణిజ్య పన్ను శాఖ అధికారులు, 7 గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు, మూడు ఎంప్లాయ్‌మెంట్ అధికారులు సహా మొత్తం 95 గ్రూప్– 1 పోస్టుల భర్తీకి 2022లో టీఎన్‌పీఎస్సీ చర్యలు తీసుకుంది.
చదవండి: TSPSC: గ్రూప్–2, గ్రూప్– 3 ఖాళీల గుర్తింపునకు కసరత్తు షురూ!
ఈ పోస్టులకు 3, 22,414 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే ప్రిలిమనరీ పరీక్షకు లక్ష 90 వేల 518 మంది హాజరయ్యారు. ఇందులో ఉత్తీర్ణత మేరకు 2,162 మంది మెయిన్స్‌కు అర్హత సాధించారు. గత ఏడాది ఆగస్టులో మెయిన్స్ పరీక్ష జరిగింది.
చదవండి: TSPSC చైర్మన్‌గా మాజీ డీజీపీ!.. పరీక్షలు, ఫలితాలపై నిరుద్యోగుల ఆశలు
వాల్యుయేషన్ ప్రక్రియ ముగియడంతో మార్చి 7న ఫలితాలను టీఎన్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో ప్రకటించారు. ఇందులో ఉత్తీర్ణులైన వారికి ఈనెల 26,27,28 తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఈ మేరకు అభ్యర్థులకు ఎస్‌ఎంఎస్‌ల ద్వారా సమాచారం పంపించనున్నట్లు టీఎన్‌పీఎస్సీ వర్గాలు వెల్లడించాయి.