Telangana: ఎస్‌జీటీలకు పదోన్నతి అవకాశం
ఇందులో పండిట్‌లు, పీడీలకే కాకుండా సీనియారిటీ, అర్హతను బట్టి ఎస్‌జీటీలకు కూడా స్కూల్ అసిస్టెంట్లు(ఎస్‌ఏలు)గా పదోన్నతి పొందే అవకాశం కల్పించారు. గతంలో తెలుగు, హిందీ పండిట్‌లు, పీడీ కోర్సులు చేసిన వారికి మాత్రమే భాషా పండిట్‌లు, పీడీ పోస్టుల్లో స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పిస్తూ వచ్చారు. దీంతో తమకు కూడా కల్పించాలని ఎస్‌జీటీలు ఇటీవల హైకోర్టుకు వెళ్లారు. దీంతో హైకోర్టు రెండు రోజుల క్రితం అర్హత ఉన్న ఎస్‌జీటీలకు కూడా భాషా పండిట్‌లు, పీడీ పోస్టుల్లో స్కూల్ అసిస్టెంట్లుగా అవకాశం ఇవ్వాలని ఆదేశించింది. దీంతో ఎస్‌జీటీలకు అర్హత మేరకు పదోన్నతి లభించనుంది.
చదవండి: TRT: పెరిగిన సిలబస్... ఆధునిక బోధనపైనే దృష్టి
టెట్ నిబంధనతో ఆందోళన!
స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు పొందేవారికి టెట్ తప్పనిసరి అని విద్యాశాఖ చెబుతోంది. దీంతో సీనియర్లకు అన్యాయం జరిగే అవకాశం ఉంది. 2010 కంటే ముందు ఉపాధ్యాయులుగా నియమితులైన వారికి టెట్ పరీక్ష లేదు. దీంతో వారికి సీనియారిటీ ఉన్నా టెట్ నిబంధనతో పదోన్నతి పొందే అవకాశం ఉండదని ఆందోళన చెందుతున్నారు. టెట్ నిబంధన లేకుండా సవరించాలని అర్హత ఉన్న ఎస్‌జీటీలు డిమాండ్ చేస్తున్నారు.
చదవండి: TS DSC 2023 : DSC సిలబస్, బెస్ట్ బుక్స్ ఇవే..| ముందుగానే..ఇలా చదివితే 'టీచర్' ఉద్యోగం మీదే..