Skip to main content

957 Jobs: స్టాఫ్‌ నర్సు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌.. జోన్ల వారీగా ఖాళీలు ఇలా..

సాక్షి, అమరావతి: ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం మరో ముందడుగు వేసింది.
957 Jobs
స్టాఫ్‌ నర్సు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌.. జోన్ల వారీగా ఖాళీలు ఇలా..

ప్రభుత్వ ఆస్పత్రుల్లో 957 స్టాఫ్‌ నర్స్‌ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్‌ ప్రజారోగ్య కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్‌ డిసెంబర్‌ 2న నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఇటీవల 461 స్టాఫ్‌ నర్స్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. దానికి అదనంగా 496 పోస్టులను కలిపి మొత్తం 957 పోస్టులతో సవరించిన నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. డిసెంబర్‌ 2 నుంచి దరఖాస్తు ఫారాలను http://cfw.ap.nic.in వెబ్‌ సైట్లో అందుబాటులో ఉంచారు.

చదవండి: 461 Jobs: స్టాఫ్‌ నర్సు పోస్టులకు నోటిఫికేషన్‌

డిసెంబర్‌ ఎనిమిదో తేదీ వరకూ దరఖాస్తు ఫారాలు వెబ్‌సైట్లో ఉంటాయి. వీటిని డౌన్లోడ్‌ చేసుకుని భర్తీ చేసిన దరఖాస్తులను సంబంధిత రీజినల్‌ డైరెక్టర్‌ కార్యాలయాల్లో డిసెంబర్‌ 9వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు సమర్పించాల్సి ఉంటుంది. జీఎన్‌ఎం (జనరల్‌ నర్సింగ్‌ మిడ్‌ వైఫర్‌)/ బీఎస్సీ (నర్సింగ్‌) కోర్సులు పూర్తి చేసి 42 ఏళ్లలోపు వయసున్న వారు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు ఐదేళ్లు, మాజీ సైనికులకు మూడేళ్లు, విభిన్న ప్రతిభావంతులకు 10 ఏళ్ల పాటు వయో పరిమితిలో సడలింపునిచ్చారు. దరఖాస్తు రుసుమును ఓసీ అభ్యర్థులకు రూ. 500, ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు రూ. 300గా నిర్ణయించారు. మెరిట్‌ ప్రాతిపదికన అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా రూపొందించే మెరిట్‌ లిస్ట్‌ను 2023 ఆగస్టు వరకు పరిగణనలోకి తీసుకుంటారు. ప్రభుత్వాస్పత్రుల్లో మానవ వనరులకు కొరత లేకుండా ఉండేందుకు గత మూడున్నరేళ్ల కాలంలో వైద్య ఆరోగ్యశాఖలో 46 వేలకు పైగా పోస్టులను ఈ ప్రభుత్వం భర్తీ చేయడం గమనార్హం.

జోన్ల వారీగా స్టాఫ్‌ నర్సు పోస్టుల ఖాళీలు 

జోన్‌ 1

 163

జోన్‌ 2

 264

జోన్‌ 3

 239

జోన్‌ 4

 291

మొత్తం

 957

Published date : 03 Dec 2022 03:49PM

Photo Stories