Department of Health: డిప్యుటేషన్ లు వద్దు.. ఖాళీలను భర్తీ చేయండి: సిఎం వైఎస్ జగన్
ఇంకా ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి కసరత్తు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖలోని అన్ని విభాగాలు, ఆస్పత్రుల్లో ఎలాంటి ఖాళీలున్నా తక్షణమే భర్తీ చేయాలని ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులకు ఆదేశాలిచ్చారు. డిప్యుటేషన్లు ఇవ్వాల్సిన అవసరం లేదని.. ఖాళీలుంటే భర్తీ చేయాలని ఆదేశించారు. దీంతో ఆరోగ్య శాఖలో భారీ నియామక ప్రక్రియకు రంగం సిద్ధమైంది. రెండు నెలల్లో అన్ని ఖాళీలను భర్తీ చేసేందుకు అధికారులు ప్రయతి్నస్తున్నారు. భవిష్యత్‌లో డిప్యుటేషన్లు లేకుండా సరిపోయినంత స్థాయిలో మానవ వనరులు అందుబాటులో ఉండాలన్నది ముఖ్యమంత్రి ఉద్దేశం.
గత ప్రభుత్వ హయాంలో నిల్..
టీడీపీ ప్రభుత్వ హయాంలో 2014–19 మధ్య ఆరోగ్య శాఖలో ఒక్క పోస్టు కూడా భర్తీ కాలేదు. దీంతో భారీగా మానవ వనరుల కొరత ఏర్పడింది. ఎక్కడికెళ్లినా డాక్టర్లు, నర్సులు కొరత తీవ్రంగా వేధించేది. రోగులు ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లాలంటేనే ఇబ్బంది పడేవాళ్లు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక భారీ ఎత్తున వైద్యులు, సిబ్బంది నియామకాలు చేపట్టడంతో సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆస్పత్రులు, బోధనాస్పత్రులకు వచ్చే వారి సంఖ్య పెరిగింది. ఇప్పటికే 2,600కు పైగా వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్, ఇ–సంజీవని సేవలు ప్రజలకు అందుతున్నాయి. దేశవ్యాప్తంగా ఇ–సంజీవని ద్వారా లబ్ధి పొందుతున్నవారిలో రాష్ట్రానికి చెందినవారే 40 శాతం మంది ఉన్నారు.
ఖాళీగా ఉన్న పోస్టులు 7 వేలకు పైగానే..
వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను అధికారులు లెక్కిస్తున్నారు. ఇవి సుమారు 7 వేల నుంచి 8 వేల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఎన్ని ఖాళీలున్నా సరే భర్తీ చేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో పోస్టులను గుర్తించిన వెంటనే నోటిఫికేషన్ లు ఇచ్చి భర్తీ చేయడానికి సిద్ధమవుతున్నారు. పోస్టుల భర్తీ జరిగితే డిప్యుటేషన్లను పూర్తిగా రద్దు చేస్తారు. వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది నియామకాలు పూర్తయితే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలోనే పూర్తి స్థాయిలో వైద్యసేవలు, నిర్ధారణ పరీక్షలు అందనున్నాయి.
వెఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో భర్తీ అయిన పోస్టుల వివరాలు..
రాష్ట్ర స్థాయిలో రెగ్యులర్ నియామకాలు..
విభాగం |
కేడర్ |
భర్తీ చేసిన పోస్టుల సంఖ్య |
వైద్యవిద్యా శాఖ |
అసిస్టెంట్ ప్రొఫెసర్ |
695 |
వైద్యవిధాన పరిషత్ |
సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ |
218 |
వైద్యవిధాన పరిషత్ |
డెంటల్ అసిస్టెంట్ సర్జ న్ |
26 |
ప్రజారోగ్య శాఖ |
సివిల్ అసిస్టెంట్ సర్జన్ |
615 |
జిల్లాలవారీగా రెగ్యులర్ నియామకాలు..
విభాగం |
భర్తీ చేసిన పోస్టుల సంఖ్య |
వైద్యవిద్యా సంచాలకులు |
2,869 |
వైద్యవిధాన పరిషత్ |
1,332 |
ప్రజారోగ్యశాఖ |
2,105 |
జాతీయ ఆరోగ్యమిషన్ పరిధిలో |
2,719 |
అర్బన్ హెల్త్ సెంటర్లలో డాక్టర్లు |
460 |
ఈ ఏడాది కోవిడ్ నియామకాలు..
కేటగిరీ |
పోస్టుల భర్తీ |
స్పెషలిస్టు డాక్టర్లు |
133 |
ఎంబీబీఎస్ డాక్టర్లు |
4,020 |
స్టాఫ్ నర్సులు |
6,429 |
ఎఫ్‌ఎన్ వో/ఎంఎన్ వో |
5,715 |
క్లాస్ 4 ఉద్యోగులు |
2,966 |
డేటా ఎంట్రీ ఆపరేటర్లు |
1,324 |