ఈ ఉద్యోగుల రిటైర్‌మెంట్ వయసు పెంపు
Sakshi Education
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉద్యోగుల రిటైర్‌మెంట్ వయసును 62 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం డిసెంబర్ 16న ఉత్తర్వులు జారీచేసింది.
ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్‌మెంట్ వయసును 62 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం గతంలో ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే. ఉద్యోగ విరమణ వయసు పెంపును తమకూ వర్తింపజేయాలని ఎయిడెడ్ స్కూళ్ల సిబ్బంది కోరుతున్నారు.
చదవండి: పేద పిల్లలకు ఈ స్కూళ్లలో ఉచిత ప్రవేశాలు.. షెడ్యూల్ ఇలా..
ఈ మేరకు ఎయిడెడ్ సంస్థల్లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బందికి కూడా ఉద్యోగ విరమణ వయసు పెంపును వర్తింపజేస్తూ తాజాగా ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి సర్క్యులర్ జారీచేశారు.
చదవండి: మెడికల్ కాలేజీల ప్రిన్సిపాళ్లు, డీఎంఈల వయోపరిమితి 65 ఏళ్లకు పెంపు
Published date : 17 Dec 2022 05:35PM