కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఆర్థిక భరోసా
సరిపోని జీతంతో, సమస్యల నడుమ ఉద్యోగ జీవితాన్ని నెట్టుకొచ్చింది. ఇక ఈ జీవితం ఇంతేనా అని ఓ దశలో నిరాశతో కుంగిపోయింది. వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పరిస్థితి మారుతుందని పలువురు అంటుంటే.. ఆ రోజు త్వరగా రావాలని తనూ కలలు కనింది. ఇప్పుడు ఆ కల నిజం అయిందని ఆనందంతో చెబుతోంది. జగన్ ప్రభుత్వ చర్యల వల్ల తనకు ఏకంగా రూ.13 వేల వరకు జీతం పెరిగిందని సంబరపడుతోంది. ఇలా లక్ష్మి ఒక్కరే కాదు.. వేలాది మంది కాంట్రాక్టు ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో వేతనాలు పెంచాలని, మినిమమ్ టైమ్ స్కేలు ఇవ్వాలని గత ప్రభుత్వ హయాంలో పలుమార్లు కాంట్రాక్టు ఉద్యోగులు ప్రభుత్వానికి విన్నవించుకున్నా ఫలితం లేకపోయింది. ఆందోళన బాట పట్టిన వారిని ఉద్యోగాల నుంచి తొలగించారు. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌కు సరిగ్గా 20 రోజుల ముందు 2019 జనవరి 28న జీఓ 12, ఫిబ్రవరి 18న జీఓ 24 ఇచ్చారు కానీ అమలు చేయకుండా మోసం చేశారు. కేవలం ఓట్లు దండుకోవాలనేదే అప్పటి సీఎం చంద్రబాబు ఎత్తుగడ. అప్పట్లో ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ తన సుదీర్ఘ పాదయాత్రలో కాంట్రాక్టు ఉద్యోగుల వెతలను కళ్లారా చూసి.. ఈ పరిస్థితి మారుస్తానని హామీ ఇచ్చారు. ఆ మేరకు అధికారంలోకి రాగానే దాదాపు అన్ని విభాగాల్లోని కాంట్రాక్టు ఉద్యోగుల కు ఎంటీఎస్ (మినిమం టైమ్ స్కేలు) వర్తించేలా జీఓ 40ని అమల్లోకి తెచ్చారు. ప్రభుత్వ ఉద్యోగిను లతో సమానంగా కాంట్రాక్టు ఉద్యోగినులకు కూడా మెటర్నిటీ లీవు, ఇతర సదుపాయాలు కల్పించారు. కాంట్రాక్టు ఉద్యోగులు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.5 లక్షలు, సహజ మరణానికి రూ.2 లక్షలు పరిహారం అందించేలా ఉత్తర్వులు జారీ చేశారు.
రూ.249.35 కోట్ల మేర వేతనాల పెంపు
- టీడీపీ ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాల కోసం ఏటా రూ.330.54 కోట్లు వెచ్చించేది. ఈ లెక్కన ఒక్కో కాంట్రాక్టు ఉద్యోగికి సగటు వేతనం రూ.15 వేలు మాత్రమే.
- వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక వేతనాల పెంపుతో కాంట్రాక్టు ఉద్యోగుల జీతాల కోసం ఏటా వెచ్చించే మొత్తం రూ.579.89 కోట్లకు చేరింది. అంటే గత ప్రభుత్వంలో వెచ్చించిన మొత్తం కన్నా రూ.249.35 కోట్లు అదనం.
- ఫలితంగా 18,060 మంది కాంట్రాక్టు ఉద్యోగులకు లబ్ధి కలిగింది. సగటున ఒక్కొక్కరికి నెలకు సరాసరిన అందే వేతనం దాదాపు రూ.26,758. ఈ ప్రభుత్వ చర్యల వల్ల 18 శాతం నుంచి 82 శాతం వరకు వేతనాలు పెరిగాయి.
- విద్యా శాఖ ఉద్యోగులకు భారీగా లబ్ధి
- ఉన్నత విద్యా శాఖ కాలేజీ ఎడ్యుకేషన్లోని జూనియర్ లెక్చరర్లు, లెక్చరర్లు, లైబ్రేరియన్లు, ప్రొఫెసర్/ ఇతర ఫ్యాకల్టీకి సంబంధించి 691 మందికి ఎంటీఎస్ అమలవుతోంది.
- ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ కు సంబంధించి జూనియర్ అసిస్టెంట్, జూనియర్ లెక్చరర్లు, ల్యాబ్ అసిస్టెంటు, లెక్చరర్లు ఇతర ఫ్యాకల్టీలో 3,728 మందికి వేతనాల పెంపు ద్వారా లబ్ధి చేకూరింది. సాంకేతిక విద్యా శాఖలోని ఎలక్ట్రీషియన్లు, ల్యాబ్ అసిస్టెంట్లు, లెక్చరర్లు, ఫార్మాసిస్టులు, వర్కుషాప్ అటెండెంట్లు తదితరులు 432 మందికి మేలు చేకూరుతోంది.
- సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల విద్యా సంస్థలు, గిరిజన సంక్షేమ శాఖ గురుకుల విద్యాలయాలు, ఏపీ గురుకుల విద్యా సంస్థలు, కస్తూరిబా బాలికా విద్యాలయాలు, బీసీ సంక్షేమ శాఖ గురుకుల విద్యా సంస్థలు, ఏపీ వైద్య విధాన పరిషత్, స్పోర్ట్సు అథారిటీ ఆఫ్ ఏపీ విభాగాల్లోని 6,026 మందికి వేతనాల పెంపును అమలు చేస్తున్నారు.
- యూనివర్సిటీల్లోని కాంట్రాక్టు అధ్యాపకులకు ఎంటీఎస్ అమల్లో గత ప్రభుత్వ తప్పిదాల వల్ల ఆటంకాలు ఎదురవుతున్నాయి. వీరు 4,077 మంది ఉండగా ఇప్పటికే జేఎన్ టీయూ కాకినాడ, జేఎన్ టీయూ అనంతపురం, ఆదికవి నన్నయ, శ్రీవెంకటేశ్వర వర్సిటీల్లో వేతనాలను రూ.40 వేల వరకు పెంచి అందిస్తున్నారు.
- అవుట్‌సోర్సింగ్ సిబ్బందికి తొలగిన కష్టాలు
- గత ప్రభుత్వ హయాంలో అవుట్ సోర్సింగ్ సిబ్బంది విషయంలో అనేక అక్రమాలు, భారీగా అవినీతి చోటుచేసుకుంది. అప్పటి సీఎం చంద్రబాబు తనకు సన్నిహితులైన వారికి ఏజెన్సీలను కట్టబెట్టారు.
- ఈ ఏజెన్సీలు లక్షలు వసూలు చేసి పోస్టులు అమ్ముకున్నాయి. జీతాల్లో కోత పెట్టి ఎప్పుడో ఇచ్చే వారు. ఉద్యోగ భద్రత అసలు ఉండేది కాదు. పీఎఫ్, ఈఎస్‌ఐ వంటి సదుపాయాల్లేవు.
- వీరి ఆవేదనను కళ్లారా చూసిన వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే ఏజెన్సీలను రద్దు చేసి, ప్రత్యేకంగా అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ (ఏపీసీఓఎస్ –ఆప్కోస్– ఏపీ కార్పొరేషన్ ఫర్ అవుట్ సోర్స్‌డ్ సర్వీసెస్) ఏర్పాటు చేసి 1.20 లక్షలకు పైగా ఉద్యోగులను దాని పరిధిలోకి చేర్చారు. ప్రతి నెల నయాపైసా కోత లేకుండా నేరుగా వారి అకౌంట్లలో వేతనం పడేలా చేశారు. ఈఎస్‌ఐ, ఈపీఎఫ్ సదుపాయాలు కల్పించారు.
కాంట్రాక్టు ఉద్యోగులకు లబ్ధి ఇలా..
ప్రభుత్వ శాఖ |
ఉద్యోగి హోదా |
ఎంటీఎస్ అమలుకు ముందు వేతనం (రూ.లలో) |
ఎంటీఎస్ అమలుతో పెరిగిన వేతనం (రూ.లలో) |
పెరుగుదల శాతం |
గిరిజన సంక్షేమ శాఖ |
స్కూల్ అసిస్టెంట్ |
16,350 |
29,840 |
82.50765 |
సాంఘిక సంక్షేమ శాఖ |
లైబ్రేరియన్ |
20,490 |
35,120 |
71.40068 |
సాంఘిక సంక్షేమ శాఖ (ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఈఎస్/బీసీ) |
జూనియర్ లెక్చరర్ |
24,460 |
37,100 |
51.67621 |
ఇంటర్మీడియెట్ విద్యాశాఖ |
జూనియర్ లెక్చరర్ |
27,000 |
37,100 |
37.40741 |
కాలేజీ విద్య శాఖ |
లెక్చరర్ |
30,000 |
40,270 |
34.23333 |
ఏపీఆర్‌ఈఐఎస్ |
టీజీటీ |
22,200 |
28,940 |
30.36036 |
ఏపీఆర్‌ఈఐఎస్ |
పీజీటీ |
24,150 |
31,460 |
30.26915 |
సాంఘిక సంక్షేమ శాఖ (ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఈఎస్/బీసీ) |
స్టాఫ్‌నర్స్ |
19,350 |
25,140 |
29.92248 |
సాంఘిక సంక్షేమ శాఖ (ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఈఎస్/బీసీ) |
పీఈటీ |
16,350 |
21,230 |
29.84709 |
గిరిజన సంక్షేమ శాఖ |
ఎస్‌జీటీ |
22,290 |
28,940 |
29.83401 |
సాంకేతిక విద్యా శాఖ |
వర్కుషాప్ అటెండెంట్ |
12,000 |
15,460 |
28.83333 |
సాంఘిక సంక్షేమ శాఖ (ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఈఎస్/బీసీ) |
పీజీటీ |
24,460 |
31,460 |
28.61815 |
సాంకేతిక విద్యా శాఖ |
లెక్చరర్ పాలిటెక్నికల్ |
28,000 |
35,120 |
25.42857 |
సాంఘిక సంక్షేమ శాఖ |
హెల్త్ సూపర్వైజర్ |
17,925 |
22,460 |
25.29986 |
పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ |
ఎంహెచ్‌ఏ(మేల్) |
22,900 |
28,450 |
24.23581 |
గిరిజన సంక్షేమ శాఖ ఏపీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్ |
జూనియర్ లెక్చరర్ |
15,000 |
17,890 |
19.26667 |
సాంఘిక సంక్షేమ శాఖ (ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఈఎస్/బీసీ) |
టీజీటీ |
24,460 |
28,940 |
18.31562 |
విభాగాల వారీగా కాంట్రాక్టు ఉద్యోగులకు కలిగిన లబ్ధి ఇలా..
విభాగం |
ఉద్యోగుల సంఖ్య |
ప్రస్తుతం ఒక్కో ఉద్యోగికి నెలవారీ వేతనం |
ఏడాదికి గతంలో ఖర్చు (రూ.కోట్లలో) |
ఏడాదికి ప్రస్తుత ఖర్చు (రూ.కోట్లలో) |
అగ్రికల్చర్ |
1,695 |
15,000.00 |
17.37 |
30.47 |
హార్టికల్చర్ |
122 |
15,000.00 |
1.04 |
1.82 |
పశుసంవర్థక శాఖ |
14 |
15,000.00 |
0.13 |
0.22 |
మత్స్యశాఖ |
61 |
12,000.00 |
0.50 |
0.88 |
అటవీ శాఖ |
265 |
22,460.00 |
2.80 |
4.90 |
కాలేజీ విద్య |
691 |
40,700.00 |
19.01 |
33.35 |
ఇంటర్మీడియెట్ విద్య |
3,728 |
37,100.00 |
94.43 |
165.67 |
ఏపీ వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ |
36 |
16,400.00 |
0.40 |
0.71 |
ఆర్థిక శాఖ |
5 |
2,30,595.00 |
0.43 |
0.76 |
సాధారణ పరిపాలనాశాఖ |
5 |
50,000.00 |
0.17 |
0.30 |
సమాచార శాఖ |
9 |
1,50,000.00 |
0.53 |
0.94 |
ఏసీబీ |
1 |
25,000.00 |
0.02 |
0.03 |
రాజ్‌భవన్ సచివాలయం |
7 |
1,02,000.00 |
0.37 |
0.65 |
విజిలెన్సు అండ్ ఎన్ ఫోర్సుమెంటు |
2 |
73,452.00 |
0.09 |
0.16 |
ఏపీభవన్ ఢిల్లీ |
15 |
1,85,000.00 |
0.57 |
1.00 |
మెడికల్ ఎడ్యుకేషన్ |
1,460 |
2,25,000.00 |
22.67 |
39.77 |
పబ్లిక్‌హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ |
4,627 |
1,30,000.00 |
90.56 |
158.88 |
ఫ్యామిలీ వెల్ఫేర్ |
77 |
53,495.00 |
1.57 |
2.75 |
ఆయుష్ |
55 |
37,100.00 |
0.91 |
1.59 |
పోలీసు విభాగం డీజీపీ |
105 |
1,25,000.00 |
1.06 |
1.86 |
ఏపీఎస్‌పీ |
69 |
28,000.00 |
0.59 |
1.03 |
గ్రౌండ్‌వాటర్ |
10 |
32,000.00 |
0.22 |
0.38 |
వాటర్‌రిసోర్సు |
293 |
32,000.00 |
2.72 |
4.77 |
ఇరిగేషన్ |
79 |
12,000.00 |
0.65 |
1.14 |
ఇరిగేషన్ |
409 |
34,318.00 |
3.43 |
6.01 |
పోర్టుల డైరక్టరేట్ |
1 |
80,000.00 |
0.05 |
0.10 |
ఇండస్ట్రీస్ |
2 |
80,000.00 |
0.08 |
0.13 |
హేండ్లూమ్ టెక్స్‌టైల్స్ |
5 |
25,350.00 |
0.06 |
0.11 |
ఇన్సూరెన్సు మెడికల్ సర్వీస్ |
23 |
41,912.00 |
0.33 |
0.58 |
న్యాయశాఖ |
5 |
56,960.00 |
0.12 |
0.22 |
హైకోర్టు |
494 |
60,000.00 |
5.63 |
9.88 |
అడ్వొకేట్ జనరల్ (లా) |
35 |
17,500.00 |
0.34 |
0.59 |
స్టేట్ లీగల్ సెల్ అథారిటీ |
21 |
28,940.00 |
0.29 |
0.51 |
లెజిస్లేచర్ సచివాలయం |
1 |
90,000.00 |
0.06 |
0.11 |
పంచాయతీరాజ్ |
1 |
15,000.00 |
0.01 |
0.02 |
పంచాయతీరాజ్ (ఇంజనీరింగ్) |
80 |
38,000.00 |
1.74 |
3.04 |
రూరల్ వాటర్ సప్లయ్ |
84 |
37,100.00 |
1.84 |
3.23 |
రెవెన్యూ (సచివాలయం) |
1 |
75,000.00 |
0.05 |
0.09 |
భూపరిపాలనా విభాగం |
52 |
25,000.00 |
0.72 |
1.27 |
రిలీఫ్, డిజాస్టర్ మేనేజ్‌మెంటు |
22 |
1,25,000.00 |
0.90 |
1.58 |
ఎంప్లాయ్‌మెంటు ట్రయినింగ్ విభాగం |
585 |
29,760.00 |
8.27 |
14.52 |
సాంకేతిక విద్యాశాఖ |
432 |
35,120.00 |
8.41 |
14.75 |
సోషల్ వెల్ఫేర్ విభాగం (సచివాలయం) |
1 |
65,000.00 |
0.04 |
0.08 |
సోషల్ వెల్ఫేర్ విభాగం |
6 |
1,52,500.00 |
0.23 |
0.41 |
గిరిజన సంక్షేమ శాఖ |
1,984 |
1,10,000.00 |
34.19 |
59.98 |
మహిళా శిశుసంక్షేమ, అభివృద్ధి శాఖ |
352 |
60,000.00 |
4.66 |
8.17 |
దివ్యాంగులు, సీనియర్ సిటిజన్ శాఖ |
5 |
37,100.00 |
0.11 |
0.20 |
జువైనల్ సంక్షేమ విభాగం |
4 |
18,400.00 |
0.05 |
0.09 |
యువజన సంక్షేమ శాఖ |
1 |
16,400.00 |
0.01 |
0.02 |
యువజన సంక్షేమ, కల్చరల్ అఫైర్స్ |
23 |
10,000.00 |
0.10 |
0.17 |
మొత్తం |
18,060 |
|
330.54 |
579.89 |
చదవండి: