Medical Health Department: వైద్య పోస్టులకు కౌన్సెలింగ్ తేదీలు ఇవే..
969 పోస్టుల్లో ప్రజారోగ్య సంచాలకుని పరిధిలో భర్తీ చేసేవే ఎక్కువ. దాంతో ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు ఆ రెండు రోజుల్లో కౌన్సెలింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని అధికారులు తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర మెడికల్, హెల్త్ సరీ్వసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేసింది. నేడో రేపో తుది జాబితాను విడుదల చేసే అవకాశముంది. అభ్యర్థులు ఇచ్చే ప్రాధాన్యాల ప్రకారం సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను భర్తీ చేయాలని అధికారులు భావిస్తున్నారు.
చదవండి: 461 Jobs: స్టాఫ్ నర్సు పోస్టులకు నోటిఫికేషన్
కంటి వెలుగు ప్రారంభానికి ముందే...
ప్రజారోగ్య సంచాలకులు (డీహెచ్) పరిధిలో 751 సివిల్ అసిస్టెంట్ సర్జన్, తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) పరిధిలో 211 జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం)లో 7 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ మూడు విభాగాలకు చెందిన పోస్టులకు విడివిడిగా కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. కంటి వెలుగు ప్రారంభానికి ముందే కొత్త డాక్లర్లు విధుల్లో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
చదవండి: Medical and Health Department: వైద్యులకు ఇష్టమైనచోట పోస్టింగ్
3న సాధారణ బదిలీలకు కౌన్సెలింగ్...
ప్రజారోగ్య సంచాలకుల పరిధిలో పనిచేస్తున్న వైద్యుల ప్రత్యేక బదలీలు చేపట్టాలని వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయించిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 3వ తేదీన ఉదయం 11 గంటలకు బదిలీలకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. అర్హత కలిగిన సివిల్ అసిస్టెంట్ సర్జన్లు (మెడికల్ ఆఫీసర్లు) నవంబర్ 25వ తేదీ లోగా బదిలీలకు దరఖాస్తు చేసుకోవాలని గతంలోనే సూచించిన సంగతి తెలిసిందే. 1) భార్య/భర్త (జీవిత భాగస్వామి) 2) 70 శాతం, ఆపై వైకల్యం 3) మానసిక వైకల్యం కలిగిన పిల్లలున్నవారు 4) వితంతువులు 5) క్యాన్సర్, న్యూరోసర్జరీ, కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్, లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్, ఓపెన్ హార్ట్ సర్జరీ, బోన్ టీబీ తదితర తీవ్రమైన వ్యాధులకు చికిత్స పొందుతున్నవారు... ఈ బదలీలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులుగా పేర్కొన్నారు. ఒరిజినల్ సరి్టఫికెట్లతో కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని సూచించారు.