Ambedkar Study Circle: అంబేడ్కర్ స్టడీ సర్కిల్ ప్రారంభం
Sakshi Education
తిరుపతి చెన్నారెడ్డి కాలనీలో రూ.2 కోట్లతో నిరి్మంచిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఏపీ స్టడీ సర్కిల్‌ను నవంబర్ 8న రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి విశ్వరూప్, తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, విద్యార్థులను ఉన్నత స్థానంలో నిలబెట్టాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆకాంక్ష అన్నారు. ఏపీ స్టడీ సర్కిల్‌ను శ్రీవారి పాదాల చెంత ప్రారంభించడం బడుగులకు శుభసూచకమన్నారు. ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్–1 స్థాయి ఉద్యోగాల్లో ఉన్న 90 శాతం మంది స్టడీ సర్కిల్స్‌లో శిక్షణ పొంది ఎంపికైన వారేనని గుర్తుచేశారు. గత ప్రభుత్వం విద్యను కార్పొరేట్‌కు కట్టబెట్టి స్టడీ సర్కిల్ బోధనలను విస్మరించిందని ధ్వజమెత్తారు. తిరుపతిలో బ్యాంకు ఉద్యోగాలకు, విజయవాడలో గ్రూప్–1కు, విశాఖపట్నంలో సివిల్స్‌లో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.
చదవండి:
Published date : 09 Nov 2021 01:05PM