Skip to main content

High Court: 39 మందికి జూనియర్‌ సివిల్‌ జడ్జీలుగా పోస్టింగ్‌.. పోస్టింగ్ పోందిన‌ వారు వీరే..

సాక్షి, హైదరాబాద్‌: Junior Civil Judge (JCJ)లుగా ఎంపికైన 39 మందికి పోస్టింగ్‌లు ఇస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
High Court
39 మందికి జూనియర్‌ సివిల్‌ జడ్జీలుగా పోస్టింగ్‌

2021–22లో నోటిఫికేషన్‌ ఇవ్వగా, పోస్టింగ్‌ వివరాలను రిజిస్ట్రార్‌ జనరల్‌ (విజిలెన్స్‌) సెప్టెంబర్‌ 21న వెల్లడించారు. వీరంతా అక్టోబర్‌ 4వ తేదీలోగా తమకు పోస్టింగ్‌ ఇచ్చినచోట బాధ్యతలు చేపట్టాలని ఆదేశించారు. కొత్త జేసీజేలకు బాధ్యతలు అప్పగించే కార్యక్రమాన్ని చేపట్టాలని ఆయా కోర్టుల బాధ్యులకు సూచించారు.

చదవండి: New labour law: కార్మికుల‌కు శుభ‌వార్త‌... 30 కంటే లీవ్స్‌ ఎక్కువ ఉంటే డబ్బులు చెల్లించాల్సిందే.. కొత్త కార్మిక‌చ‌ట్టంలోని నిబంధ‌న‌లు ఇవే..!

కొత్త జేసీజేలు అక్టోబర్‌ 6న వీరి బాధ్యతలు మరొకరికి అప్పగించి, 7వ తేదీ నుంచి సికింద్రాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర జ్యుడీషియల్‌ అకాడమీలో జరిగే శిక్షణకు హాజరుకావాల్సి ఉంటుందని చెప్పారు. జేసీజేలంతా వైద్యుడు ధ్రువీకరించిన ఫిట్‌నెట్‌ సర్టిఫికెట్‌ అందజేయాలని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, మరో 18 మంది జడ్జీలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువరించింది.

చదవండి: Success Story: 23 ఏళ్ల‌కే జూనియర్‌ సివిల్‌ జడ్జిగా ఎంపికైన శ్రీకాకుళం కుర్రాడు... వంశీకృష్ణ స‌క్సెస్ జ‌ర్నీ సాగిందిలా..!

Published date : 22 Sep 2023 12:48PM
PDF

Photo Stories