Skip to main content

పాలిటెక్నిక్ డిప్లొమా సెమిస్టర్ పరీక్షలు వాయిదా

సాక్షి, హైదరాబాద్: కోవిడ్ వైరస్ ప్రభావంతో ఏప్రిల్ 4 నుంచి 11వ తేదీ వరకు నిర్వహించాల్సిన పాలిటెక్నిక్ డిప్లొమా సెమిస్టర్ పరీక్షలను రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ మండలి (ఎస్‌బీటీఈటీ) వాయిదా వేసింది.
ఇప్పటికే అన్ని విద్యా సంస్థలను ఈనెల 31వ తేదీ వరకు మూసివేసిన నేపథ్యంలో ఆ ప్రభావం రెండో, నాలుగో సెమిస్టర్ పరీక్షలపై పడకుండా ఈ చర్యలు చేపట్టినట్లు ఎస్‌బీటీఈటీ కార్యదర్శి మూర్తి తెలిపారు. 13 రోజుల పాటు ఈ పరీక్షలను వాయిదా వేశామని, ఏప్రిల్ 20వ తేదీ తర్వాతే పరీక్షలను నిర్వహిస్తామని చెప్పారు. ఇక వచ్చే నెల 17వ తేదీన పాలీసెట్-2020 ప్రవేశ పరీక్ష యథాతథంగా నిర్వహిస్తామని వెల్లడించారు.
Published date : 19 Mar 2020 03:03PM

Photo Stories