Skip to main content

Kasturba Girls High School: కస్తూర్బా పాఠశాలలో ఐదుగురు సిబ్బంది సస్పెన్షన్‌

Suspension of five staff in Kasturba Girls High School

బ్రహ్మంగారిమఠం: మండలంలోని మద్దిరెడ్డిపల్లె దగ్గర ఉన్న కస్తూర్బా బాలికల ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఐదుగురు సిబ్బందిని సస్పెండ్‌ చేస్తూ సమగ్ర శిక్ష పథక అధికారి అంబవరం ప్రభాకర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేసినట్లు జీసీడీఓ విజయలక్ష్మి తెలిపారు.
​​​​​​​
ఈనెల 23న 7వతరగతి చదువుతున్న అబీషా అనే బాలిక అస్వస్థతకు గురైనా సిబ్బంది పట్టించుకోకపోవడంతో విద్యార్థిని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘ నాయకులు ఆందోళన చేశారు. దీనిపై జిల్లా అధికారులు విచారణ జరిపి నిర్లక్ష్యంగా వ్యవహరించిన నైట్‌వాచ్‌మన్‌ ఎస్‌.రాజేశ్వరి, అటెండర్‌ ఎస్‌.లక్ష్మిదేవి, వంట మనుషులు మరియమ్మ, రామసుబ్బమ్మ, స్వీపర్‌ రాజమ్మలను సస్పెండ్‌ చేశారన్నారు.
 

Published date : 27 Jul 2023 03:45PM

Photo Stories