గురుకుల పాఠశాలకు నీటి సరఫరా బంద్
Sakshi Education
మహబూబాబాద్ అర్బన్: జిల్లా కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలలో రెండు రోజుల నుంచి మంచి నీటి సరఫరా బంద్ అయింది.
దీంతో ఇక్కడ విద్యనభ్యసిస్తున్న సుమారు 600మంది విద్యార్థులకు ఇబ్బందులు తప్పడంలేదు. గురుకుల పాఠశాలకు మిషన్ భగీరథ నీరు అందడం లేదని విద్యార్థులు వారి తల్లిదండ్రులు వాపోతున్నారు. దీనిపై గురుకుల పాఠశాల ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ జయలక్ష్మిని వివరణ కోరగా.. మున్సిపల్ నుంచి వచ్చే నీరు రావడం లేదని, బోరు మోటార్లు మరమ్మతులు చేసి వాటిని తిరిగి వినియోగంలోకి తీసుకొచ్చి విద్యార్థుల అవసరాలు తీర్చుతామని తెలిపారు. అయితే ప్రతి పాఠశాల, గురుకులానికి మిషన్ భగీరథ నీరు అందించాలని కలెక్టర్లు ఆదేశాలు జారీ చేసినప్పటికీ క్షేత్రస్థాయిలో అది అమలు కావడంలేదు. దీంతో ఆయా విద్యాసంస్థల్లోని విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Published date : 07 Aug 2023 04:00PM