National Level Competitions: డాడ్జ్ బాల్ పోటీలకు ఎంపికైన బాలబాలికలు
సాక్షి ఎడ్యుకేషన్: జాతీయస్థాయి సబ్ జూనియర్స్ డాడ్జ్ బాల్ పోటీలలో ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిథ్యం వహించనున్న బాల, బాలికల జట్ల ఎంపిక ప్రక్రియ సోమవారం నిర్వహించినట్లు రాష్ట్ర డాడ్జ్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు కొలసాని తులసీ విష్ణు ప్రసాద్ తెలిపారు. ఆదివారం మండల పరిధిలోని చిలుమూరులోని శ్రీరామ రూరల్ విద్యా సంస్థల్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్న జట్లలో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను రాష్ట్ర జట్టుకు ఎంపిక చేసినట్లు ప్రకటించారు. బాలుర విభాగంలో రాష్ట్రం తరఫున బాపట్ల జిల్లా నుంచి ఎం.ఈశ్వర్ మణికంఠ, వై.ఆనంద్, ఎంబీవీ క్రాంతి, ఎల్.సూర్యవెంకట్, ఎ.జశ్వంత్.
Study abroad: కెనడా కాలేజీలు, వర్సిటీలకు భారత విద్యార్థుల అవసరమే ఎక్కువ!
ప్రకాశం జిల్లా నుంచి ఎం.విశ్వసాయి, జె. వీరపవన్ కుమార్‌రెడ్డి, ఎం.జస్వంత్. గుంటూరు జిల్లా నుంచి ఆనంద్ వర్ధన్‌రెడ్డి. ఎన్‌టీఆర్ కృష్ణా జిల్లా నుంచి అభిషేక్. నెల్లూరు జిల్లా నుంచి సీహెచ్. భావరిష్య, పి. శవర్యంలు ప్రధాన జట్టుకు ఎంపికవ్వగా, స్టాండ్ బైలుగా కృష్ణా జిల్లా నుంచి ఎం.తానయ్య, శివమణికంఠ. నెల్లూరు జిల్లా నుంచి పి.లోహిత్ కుమార్. బాపట్ల జిల్లా నుంచి ఎల్.యుగంధర్ ఎంపికయ్యారు.
Swachh Program: స్వచ్ఛ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సేవ
బాలికల విభాగంలో.. రాష్ట్రం తరఫున ప్రాతినిథ్యం వహించడానికి ప్రకాశం జిల్లా నుంచి పి.సువర్చలదేవి, డి.మధులహరి, ఎం.మహిత, టి.రేఖాతనూజ. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నుంచి పి.చరిత, టి.పూర్ణిమ, ఆర్.సుష్మిత. బాపట్ల జిల్లా నుంచి ఎం.చరిష్మ, పి.కీర్తన, ఇ.స్వప్న. కృష్ణా జిల్లా నుంచి వి. రిషిత, కె.ప్రవల్లికలు ప్రధాన జట్టుకు ఎంపికవ్వగా, స్టాండ్ బైలుగా బాపట్ల, ప్రకాశం, కృష్ణా జిల్లాలకు చెందిన ఇ. నాగవైష్ణవి, కావ్యశ్రీ, సీహెచ్.పవిత్ర, ఎం.చంద్రికలు ఎంపికయ్యారు. రాష్ట్రానికి ఎంపికైన బాల, బాలికల జట్లు నవంబర్ నెలలో వారణాసిలో జరగనున్న జాతీయ పోటీలలో పాల్గొనగా, ఇరు జట్లకు చిలుమూరులో త్వరలో కోచింగ్ క్యాంప్ ఏర్పాటు చేసి శిక్షణ నిర్వహించనున్నట్లు డాడ్జ్ బాల్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు.