Skip to main content

Hockey Competitions: హాకీ పోటీల‌కు ఎంపికైన బాలుర క్రీడాకారులు వీరే..

ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో క్రీడాకారుల‌ను ఎంపిక చేసే ప్ర‌క్రియ జ‌రిపారు యాజ‌మాన్యం. ఈ నేప‌థ్యంలో పోటీతోపాటు జ‌ట్టు వివ‌రాల‌ను వెల్ల‌డించారు..
Competitive Selection Process for Players    Team Selection Event at School Sports Ground  Men players selected for hockey competition    Selection Process at Government Boys High School Sports Ground

సాక్షి ఎడ్యుకేష‌న్‌: హాకీ ఆంధ్రప్రదేశ్‌ ఆధ్వర్యంలో ఈనెల 10వ తేదీ నుంచి 12వ తేదీ వరకూ కర్నూలు వేదికగా జరిగే రాష్ట్ర స్థాయి సబ్‌ జూనియర్‌ బాలుర హాకీ పోటీల్లో ప్రాతినిథ్యం వహించే జిల్లా జట్టుకు క్రీడాకారుల ఎంపిక ప్రక్రియ శుక్రవారం ముగిసింది. ధర్మవరంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో చేపట్టిన ఈ ప్రక్రియను జిల్లా హాకీ అసోసియేషన్‌ అధ్యక్షుడు బీవీ శ్రీనివాసులుతోపాటు కార్యదర్శి సూర్యప్రకాష్‌ పర్యవేక్షించారు.

Bank Jobs: ఈ మూడు ప్రభుత్వ బ్యాంకుల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌.. పూర్తి వివరాలు ఇవే..

ఎంపికైన వారిలో వంశీకృష్ణ (కెప్టెన్‌), మహేష్‌, అభిషేక్‌, ఫజులుద్దీన్‌, శబరీష్‌గౌడ్‌, శివప్రసాద్‌, వెంకట్‌ అభిషిక్త్‌, రితీష్‌, రవితేజ, గణేష్‌, సంతోష్‌, అఖిల్‌కుమార్‌రెడ్డి, సాదిక్‌వలి, సంతోష్‌కుమార్‌రెడ్డి, సాత్విక్‌, అభిరామ్‌, ఆదికేశవ, రాంచరణ్‌ ఉన్నారు. అలాగే జట్టుకు కోచ్‌గా హుస్సేన్‌ వ్యవహరించనున్నారు. క్రీడాకారులకు క్రీడా దుస్తులను ఎల్‌ఎంఎస్‌ కార్పొరేట్‌ సర్వీస్‌ ప్రైవేటు లిమిటెడ్‌ అధినేత, హాకీ అసోసియేషన్‌ జిల్లా వైస్‌ ప్రెసిడెంట్‌ మహమ్మద్‌ అస్లాం అందజేశారు. కార్యక్రమంలో హాకీ అసోసియేషన్‌ జిల్లా వైస్‌ ప్రెసిడెంట్‌ గౌరీప్రసాద్‌, జాయింట్‌ కార్యదర్శి అరవింద్‌గౌడ్‌ పాల్గొన్నారు.

Published date : 10 Feb 2024 11:24AM

Photo Stories