Skip to main content

School Dropout Childrens Admission : డ్రాపౌట్‌ పిల్లలను బడిలో చేర్పించాలి

సాక్షి ఎడ్యుకేష‌న్ : గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ రేషియో (జీఈఆర్‌) సర్వేను పకడ్బందీగా నిర్వహించి డ్రాపౌట్‌ పిల్లలను పాఠశాలలో చేర్పించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ గౌతమి అధికారులను ఆదేశించారు.
School Dropout Childrens Admission
School Dropout Childrens Admission

బుధవారం నగరంలోని 40, 41 సచివాలయాలను కలెక్టర్‌ తనిఖీ చేశారు. అనంతరం జీఈఆర్‌ సర్వేకు సంబంధించి విద్యా, నగరపాలక సంస్థ అధికారులు, సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లతో సమీక్ష నిర్వహించారు. సర్వే వంద శాతం చేపట్టి 5 నుంచి 18 ఏళ్లలోపు డ్రాపౌట్స్‌ పిల్లలను బడిలో చేర్పించాలన్నారు. చిన్నారులు ఎక్కడికి వెళ్తున్నారనే విషయాన్ని ప్రతి రోజూ గుర్తించాల్సిన బాధ్యత అధికారులు, సిబ్బందిపై ఉందన్నారు. ఈ ప్రక్రియ పద్ధతి ప్రకారం నిర్వహించడానికి కంట్రోల్‌ రూంను ఏర్పాటు చేయాలని డీఈఓను కలెక్టర్‌ ఆదేశించారు.

Postpone All Exams: వానలు తగ్గేదాకా.. పరీక్షలన్నీ వాయిదా!

బడి బయట ఎవరూ ఉండకూడదన్న లక్ష్యంతో పనిచేయాలన్నారు. వలంటీర్లు ప్రతి ఇంటినీ సందర్శించి వ్యక్తిగత పరిశీలన చేయాలని, వంద శాతం పిల్లలు ఎన్‌రోల్‌మెంట్‌ అయ్యారో లేదో చూసుకోవాలన్నారు. ప్రధానంగా బాలికలు ఎట్టి పరిస్థితుల్లో డ్రాపౌట్స్‌ కాకుండా చూసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నాడు–నేడు కార్యక్రమం ద్వారా కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌ స్కూళ్లకు దీటుగా తీర్చిదిద్దుతోందని తెలిపారు. సమావేశంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ ఎస్‌ ప్రశాంత్‌కుమార్‌, నగరపాలక సంస్థ కమిషనర్‌ భాగ్యలక్ష్మి, డీఈఓ సాయిరాం, ఆర్‌ఐఓ వెంకటరమణ నాయక్‌, డీఎల్‌డీఓ ఓబుళమ్మ, ఎంఈఓ వెంకటస్వామి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Published date : 27 Jul 2023 01:40PM

Photo Stories