Dropouts: డ్రాపౌట్లను గుర్తిస్తున్నాం
డ్రాపౌట్లను గుర్తిస్తున్నాం
డ్రాపౌట్లను గుర్తించి బడుల్లో చేర్పిస్తున్నాం. 2022లో నలుగురు ఇతర రాష్ట్ర బాలలను వారి తల్లిదండ్రులకు అప్పగించాం. 2023 లో ఒడిశా, తెలంగాణ (కరీంనగర్)కు చెందిన ఇద్దరు పిల్లలను అప్పగించాం. అధికారులతో ఈ మధ్యనే న్యాయమూర్తుల సమక్షంలో భవిష్యత్ కార్యాచరణపై సమావేశం పెట్టాం. – జె.తిప్పేస్వామి, జిల్లా స్పెషల్ జువైనల్ యూనిట్ అధికారి , అడిషనల్ ఎస్పీ (అడ్మిన్)
ఎంత మందిని అప్పగించారంటే..
2019 నుంచి 2023 ఆగస్టు వరకు జరిగిన 1800 రెస్క్యూల్లో 1282 మంది బాలురు, 518 బాలికలను గుర్తించారు. వీరిలో కొందరు బాల కార్మికులు కాగా చాలా మంది ఇంటి నుంచి పారిపోయిన వారు, ఆత్మహత్య ఆలో చనలో ఉన్న వారు, ఆత్మహత్యాయత్నం చేసుకున్న వారు ఉన్నారు. వీరికి సీడబ్ల్యూసీ విభాగం వారితో కౌన్సిలింగ్ ఇప్పించి వారి తల్లిదండ్రులకు అప్పగించారు. మరో 70 మందిని విశాఖపట్నం హోమ్‌కు తరలించారు.
జీరో కేసులే లక్ష్యం
ఎస్పీ ఆదేఽశాలతో చైల్డ్ లేబర్, బాండెడ్ లేబర్ కేసులు జీరో అవ్వాలనే లక్ష్యంతో జిల్లాలో అన్ని విద్యాసంస్థలు, గ్రామాల్లో తిరిగి అవగాహన కల్పిస్తున్నాం. గతం కంటే భిన్నంగా ఆపరేషన్ ముస్కాన్‌లో భాగంగా నిరంతర రెస్క్యూలతో ఏటికేటా సంఖ్య తగ్గుతూ వస్తుంది.
– సదాశివుని కేశవరావు, ఎస్‌ఐ, ఏహెచ్‌టీయూ