Skip to main content

Quiz competition: క్విజ్‌ పోటీల షెడ్యూల్‌ ఇదే...

 Vizianagaram, Quiz competition,Vigyana Bharti and Opcast joint event announcement
Quiz competition

విజయనగరం అర్బన్‌: విజ్ఞాన భారతి, ఆప్‌క్యాస్ట్‌ సంయుక్త నిర్వహణలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నిర్వహించే కౌశల్‌–2023 క్విజ్‌ పోటీల షెడ్యూల్‌ను డీఈఓ బి.లింగేశ్వరరెడ్డి గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ భారతీయ శాస్త్రవేత్తలు, స్వదేశీయ విజ్ఞాన ఆవిష్కరణలు, మన దేశ ప్రగతిని తెలుసుకునేందుకు ఈ పోటీలు చక్కని వేదికగా నిలుస్తాయన్నారు. 8, 9, 10వ తరగతి విద్యార్థులు పోటీల్లో పాల్గొనేందుకు అర్హులుగా పేర్కొన్నారు.

కౌశల్‌ రాష్ట్ర కోఆర్డినేటర్‌ డీ.చంద్రశేఖర్‌ మాట్లాడుతూ కౌశల్‌ క్విజ్‌ పోటీల పూర్తి వివరాల కోసం 94404 44674, 94900 09294 నంబర్లను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం పోటీల వివరాల పోస్టర్‌ను డీఈఓ విడుదల చేశారు. కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్‌ టి.రాజేష్‌, జిల్లా జాయింట్‌ కోఆర్డినేటర్‌ జి.సన్యాసినాయుడు, జిల్లా సభ్యులు పి.శివాజీ, తదితరులు పాల్గొన్నారు.

Published date : 14 Oct 2023 09:41AM

Photo Stories