Open School :దూరవిద్య తో పదో తరగతి, ఇంటర్ చదివేందుకు అవకాశం
మహబూబ్‌నగర్ : చదువుకోవాలని ఆస క్తి ఉన్నప్పటికీ.. కుటుంబ పరిస్థితులు, పేదరికం ఇతరత్రా కారణాలతో అనేక మంది చదువులకు దూరమవుతుంటారు. అలాంటి చేయూతనిచ్చి వా రిని తిరిగి చదువు వైపు మళ్లించేందుకు ప్రభుత్వం ఓపెన్ స్కూల్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో 14 ఏళ్లు నిండిన వారికి చదవడం.. రాయడం వస్తే చాలా పదో తరగతిలో అడ్మిషన్లు ఇస్తున్నారు. ఇక ఇంటర్‌లో చేరాలనుకునే వారికి 16 ఏళ్లు ఉండి ఎస్సెస్సీ ఉత్తీర్ణత సాధిస్తే అడ్మిషన్లు ఇస్తారు. ఇందుకోసం గత నెల చివరి వరకు ప్రభుత్వం అడ్మిషన్లు తీసుకుంది. ఈ సందర్భంగా సుమారు 2 వేల మంది ఓపెన్ ఇంటర్, ఎస్సెస్సీలో అడ్మిషన్లు తీసుకు న్నారు. మరింత మంది విద్యార్థులకు అడ్మిషన్లు పొందే అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఫైన్‌తో ఈ నెల 30 వరకు సమయాన్ని పొడిగించింది.
అడ్మిషన్లు పొందిన వారికి..
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఓపెన్ ఇంటర్ 57, ఎస్సెస్సీ 57 స్టడీ సెంటర్లు ప్రభుత్వం నిర్వహిస్తుంది. అన్నీ హైస్కూళ్లు కావడంతో విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా వారికి వీలైనప్పుడు తరగతులకు హాజరయ్యేందుకు అవకాశం ఉంది. ఆన్‌లైన్ తరగతులకు కూడా వివిధ యూట్యూబ్ ఛానళ్ల ద్వారా అందిస్తున్నారు. అడ్మిషన్లు పొందిన వారికి ప్రభుత్వమే పుస్తకాలు, స్టడీ మెటీరియల్ అందిస్తోంది. విద్యార్థి మొత్తం 40 తరగతుల్లో కనీసం 24 తరగతులకు హాజరైన వారిని పరీక్షకు అనుమతిస్తున్నారు. ఇంటర్‌లో సైన్స్ గ్రూప్‌ల వారు కనీసం 48 ప్రాక్టికల్ తరగతులకు హాజరుకావాలి. రికార్డులు, అసైన్‌మెంట్లు తప్పకుండా రాయాలి. తరగతులకు హాజరయ్యే విద్యార్థులు దాదాపు ఉత్తీర్ణత సాధిస్తారని అధికారులు పేర్కొంటున్నారు.
రెగ్యులర్ సర్టిఫికెట్ మాదిరిగానే..
చాలామంది విద్యార్థులు ఓపెన్ విధానంలో చదివితే అక్కడ ఇచ్చే సర్టిఫికెట్ అన్ని విధాలుగా రెగ్యులర్ సర్టిఫికెట్‌లా ఉపయోగపడుతుందా.. లేదా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఇచ్చే సర్టిఫికెట్‌తో ఏ ఉద్యోగానికై నా నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. రెగ్యులర్ చదివిన వారికి సమానంగా పరిగణిస్తుంది. ఓపెన్ డిగ్రీలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, రాంరెడ్డి తదితర యూనివర్సిటీల ద్వారా సర్టిఫికెట్లు అందిస్తున్నారు. ఓపెన్ విధానంలో ఎస్సెస్సీ, ఇంటర్ సర్టిఫికెట్లను అందిస్తున్న ఓపెన్ విధానం ద్వారా మాత్రమే ఎస్సెస్సీ పాసైతే ఇంటర్, ఇంటర్ పాసైతే డిగ్రీ రెగ్యులర్‌గా కూడా చదువుకోవచ్చు.
Also Read: Reasoning Bitbanks: Model Questions for Bank Exams
విద్యార్థులు అనేక కారణాలతో చదువులకు దూరమవుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఓపె న్ స్కూల్ విధానాన్ని నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా అడ్మిషన్లు తీసుకునేందుకు అవకాశం ఉంది. విద్యార్థులు ఈ నెల 30 వరకు కొద్దిపాటి ఫైన్‌తో అడ్మిషన్లు పొందవచ్చు. ఇతర పనులు చేసుకుంటూ కూడా చదువుకునేందుకు అవకాశం ఉంది.
– రాంసుభాష్, ఓపెన్‌స్కూల్ కోఆర్డినేటర్, ఉమ్మడి మహబూబ్‌నగర్
సద్వినియోగం చేసుకోవాలి..
విద్యార్థుల చదువులకు ఆటంకం కలగకుండా ఓపెన్ స్కూల్ విధానం ద్వారా చదువులు కొనసాగించవచ్చు. ఇక్కడ ఇచ్చే సర్టిఫికెట్ రెగ్యులర్ విద్యార్థులకు సమానంగా ఉంటుంది. అన్ని ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇలా ఉద్యోగాలు పొందిన విద్యార్థులు కూడా చాలా మంది ఉన్నారు.
– రవీందర్, డీఈఓ మహబూబ్‌నగర్