Andhra Pradesh: సార్వత్రిక విద్యాపీఠం ద్వారా ఓపెన్ స్కూల్ ప్రవేశాలు
Sakshi Education
10,11 తరగతుల విద్యార్థులకు సులభంగా ఓపెన్ స్కూళ్ళను ప్రారంభిస్తున్నట్టు ఓ ప్రకటనలో కో ఆర్డినేటర్ శ్రీనివాస్ రావు తెలిపారు. ఈ అవకాశాన్ని అర్హులందరూ వినియోగించుకోవాలని పేర్కొంటూ వాటి గురించి పూర్తి వివరణ ఇచ్చారు.
సాక్షి ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ద్వారా (ఓపెన్ స్కూల్) పదోతరగతి, ఇంటర్మీడియట్ విద్యలో ప్రవేశాలు ప్రారంభమైనట్టు జిల్లా కో ఆర్డినేటర్ సీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. గిరిమిత్ర భవనంలో ప్రవేశాలకు సంబంధించిన బ్రోచర్‌ను శుక్రవారం విడుదలచేశారు. పదోతరగతికి 14 సంవత్సరాలు, ఇంటర్మీడిట్‌లో చేరేందుకు 15 ఏళ్లు వయస్సు నిండిన వారు అర్హులని పేర్కొన్నారు.
ఈ అవకాశాన్ని మహిళలు, పలు వృత్తి, వ్యాపార రంగాల్లో ఉన్నవారు, ఉద్యోగులు, ప్రజాప్రతి నిధులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సెలవు దినాల్లో మాత్రమే తరగతులు నిర్వహిస్తామని చెప్పారు. గతేడాది 10వ తరగతిలో 750 మంది, ఇంటర్మీడియట్‌లో 438 మంది ప్రవేశాలు పొందారన్నారు. పూర్తి వివరాలకు జిల్లా కార్యాలయాల సముదాయం(ఆర్‌సీఎం)లోని జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.
Published date : 27 Aug 2023 12:12PM