New Education Policy: ప్రైవేటు పాఠశాలలకు ప్రోత్సాహం కావాలి..
మదనపల్లె సిటీ: ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న నూతన విద్యావిధానాన్ని ప్రైవేటు పాఠశాలల్లో అమలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఏపీ ప్రైవేటు అన్–ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్(అపుస్మా) రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడు రమణారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం స్థానిక బైపాస్‌రోడ్డులోని కళ్యాణ మండపంలో అపుస్మా జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది.
NBA Grade: ఎన్‌బీఏ గుర్తింపు సాధించిన ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల
ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీలు రామచంద్రారెడ్డి, కల్పలతారెడ్డి తదితరులు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలకు సహకరిస్తున్నారన్నారు. ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలలను ప్రోత్సహించాలన్నారు. కార్యక్రమంలో డీవైఈఓ శ్రీరాంపురుషోత్తం, ఎంఈఓ ప్రభాకర్‌రెడ్డి, అపుస్మా జిల్లా అధ్యక్షుడు రఘునాథరెడ్డి, కార్యదర్శి రాజశేఖర్, ఆదినారాయణరెడ్డి, వీఆర్ రెడ్డి, నాగేశ్వరరావు, భవానీప్రసాద్ పాల్గొన్నారు.
VIT - AP University: ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ వార్షిక నివేదిక వెల్లడి