Skip to main content

Navodaya Admissions: నవోదయ విద్యాలయాల్లో దరఖాస్తుల గడువు పొడగింపు

Navodaya Admissions
Navodaya Admissions

జాతీయస్థాయిలో జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో 2024–25 విద్యా సంవత్సరంలో 9, 11వ తరగతుల్లో ప్రవేశ పరీక్షలకు దరఖాస్తుకు చివరి గడువు నవంబర్‌ 7 వరకు ఉంటుందని కోచింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్‌ యన్‌.విశ్వనాథ్‌ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలియచేశారు.

9వ తరగతి ప్రవేశానికి దరఖాస్తు చేసుకునేందుకు ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులని, 11వ తరగతికి దరఖాస్తు చేసుకునేందుకు ప్రస్తుతం 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులని తెలిపారు.

ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు 2009 మే 1 నుంచి 2011 జూలై 31 మధ్య జన్మించిన వారై ఉండాలని, 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు 2007 జూన్‌ 1 నుండి 2009 జూలై 31 మధ్యన జన్మించిన వారై ఉండాలని తెలిపారు.

పరీక్ష తేదీ 10 ఫిబ్రవరి 2024న ఉంటుందని వివరించారు. మరిన్ని వివరాల కోసం 8688888802, 9399976999ను సంప్రదించాలని కోరారు.

Published date : 31 Oct 2023 08:24PM

Photo Stories