Minimum Age For Class- 1 Admission: ఆరేళ్లు నిండితేనే 1వ తరగతిలో అడ్మీషన్.. కేంద్రం కీలక సూచనలు
ఇకపై ఆరేళ్లు నిండిన చిన్నారులకే ఒకటవ తరగతిలో ప్రవేశాలు కల్పించాలని కేంద్ర విద్యాశాఖ పేర్కొంది. నూతన నూతన విద్యావిధానంలో భాగంగా పిల్లలకు 1వ తరగతి అడ్మిషన్‌పై కేంద్రం కీలక సూచనలు చేసింది. ఈ మేరకు దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు ఈ అంశంపై లేఖలు రాసింది.
వచ్చే విద్యా సంవత్సరం నుంచే..
ఆరేళ్లు నిండితేనే చిన్నారులకు ఒకటవ తరగతిలో అడ్మీషన్ ఇవ్వాలని సూచించింది. వచ్చే విద్యా సంవత్సరం 2024-25 నుంచే ఈ విధానాన్ని అమలు చేయాలని పేర్కొంది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ(ఎన్‌ఈపీ) 2020, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 కింద ఒకటవ తరగతిలో చేరే పిల్లలకు ఆరేళ్ల వయసు తప్పనిసరి చేస్తూ కేంద్ర విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది.
3 ఏళ్లు ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్, తర్వాత 2 ఏళ్లు ప్రాథమిక విద్యలో తొలిదశ అయిన 1, 2వ తరగతులు ఉంటాయి. ప్రీ స్కూల్ నుంచి 2వ తరగతి వరకు పిల్లలకు ఎలాంటి అవాంతరాలు లేని అభ్యాస పద్ధతిని ప్రోత్సహించాలనేడే ఈ విధానం ముఖ్య ఉద్దేశమని కేంద్రం తన లేఖలో పేర్కొంది.
Department of School Education & Literacy, Ministry of Education, in a letter dated 15.02.2024, with reference to D.O. letter No. 9-2/20- IS-3 dated 31.03.2021 followed by D.O. letter of even number dated 09.02.2023, requested all states/UTs to ensure that the age of admission to… pic.twitter.com/RoIrA9h9IC
— Ministry of Education (@EduMinOfIndia) February 25, 2024
Tags
- minimum age for 1st class in india
- minimum age for class 1
- Department of School Education
- School admissions
- Ministry of Education
- Union Ministry of Education
- AcademicYear 2024-25
- AcademicYear2024-25
- admissions
- GirlsEducation
- AgeRequirement
- PolicyImplementation
- NEP2020
- RTEAct2009
- EducationDepartment
- MandatoryAgeRequirement
- sakshieducation updates