Government Schools: ప్రభుత్వ బడులను నిలబెడుదాం
ఫిబ్రవరి 21న భువనగిరి, బొమ్మల రామారం, తుర్కపల్లి, యాదగిరిగుట్ట మండల ప్రజాపరిషత్ కార్యాలయాల్లో నిర్వహించిన టీఎస్‌యూటీఎప్ సమావేశాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 27వేలకు పైగా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని, వాటిలో 21లక్షల మంది విద్యనభ్యసిస్తున్నారని పేర్కొన్నారు.
వీటిని అభివృద్ధి చేస్తే మరో 20 లక్షల మంది విద్యార్థులకు చదువు చెప్పవచ్చన్నారు. ప్రతి తరగతికి గది, ఉపాధ్యాయుడు, ప్రధానోపాధ్యాయుడు, సర్వీస్ పర్సన్, తరగతుల నిర్వహణకు ఇద్దరు టీచర్లు ఉండాలన్నారు. అన్ని స్థాయిల ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి ఏం చేస్తే తల్లిదండ్రులు తమ పిల్ల లను ప్రభుత్వ పాఠశాలలకు పంపుతారో అధ్యయనం చేసి విద్యాశాఖకు సూచనలు, సలహాలు ఇవ్వాలన్నారు.
చదవండి: English Medium: ఆంగ్ల మాధ్యమం అనుసరణీయం
కలెక్టర్ చొరవ తీసుకుని సమభావన సంఘాల మహిళలు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు ఎందుకు పంపించడం లేదని డీఆర్‌డీఏ అధికారుల ద్వారా తెలుసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో టీఎస్‌యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మెతుకు సైదులు, జిల్లా ఉపాధ్యక్షురాలు సంగు వనిత, కార్యదర్శి కె.రాజగోపాల్, కోశాధికారి మల్లేశం, వివిధ మండలాల అధ్యక్షులు, కార్యదర్శులు హరిశంకర్, వెంకన్న, మురళీ, సోమసత్తిరెడ్డి, కస్తూరిబా గాంధీ విద్యాలయాల రాష్ట్ర అధ్యక్షురాలు లక్ష్మి, భిక్షమయ్య, పరమేశ్, జ్యోతి, వెంకటేశ్, శ్రీనివాస్‌రెడ్డి, నాగలింగం, ఎంఈఓ కృష్ణ, నాగార్జున, సిల్వేరు మహేష్, జీవీ రమణారావు, సిద్దులు, సుదర్శన్ రెడ్డి,శివనారాయణ, శ్రీనివాస్, ఎంఎన్‌ఓ మాలతి, శ్రీనివాస్, బాలమణి తదితరులు పాల్గొన్నారు.