Skip to main content

Kho-Kho Competitions: అండ‌ర్-19 కేట‌గిరీలో ఖోఖో పోటీలు

మూడురోజుల పాటు సాగనున్న‌ ఈ ఖోఖో పోటీల్లో సుమారు 1200 మంది క్రీడాకారుల‌తో ప్రారంభం అయ్యింద‌ని సంస్థ కార్య‌ద‌ర్శి తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ..
Introduction of team members to Joint Secretary Vijay Prakash
Introduction of team members to Joint Secretary Vijay Prakash

సాక్షి ఎడ్యుకేష‌న్: విద్యార్ధులకు క్రీడలు మానసిక, శారీరక ధృడత్వానికి దోహదపడతాయని శ్రీ ప్రకాష్‌ విద్యా సంస్ధల సంయుక్త కార్యదర్శి విజయ్‌ ప్రకాష్‌ తెలిపారు. శ్రీ ప్రకాష్‌ విద్యా సంస్ధల నందు నిర్వహిస్తున్న సీబీఎస్‌ఈ క్లస్టర్ –7 ఖోఖో పోటీలు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ నుంచి పాల్గొన్న సుమారు 1200 మంది క్రీడాకారులతో ఘనంగా ప్రారంభమైనవి.

Students Education: గిరిబిడ్డ‌ల‌కు సేవాభార‌తి అండ‌..

ఈ పోటీలు బాలుర, బాలికల విభాగంలో అండర్‌ –19 కేటగిరీలో మూడు రోజుల పాటు జరుగనున్నాయని విద్యా సంస్ధల సీనియర్‌ ప్రిన్సిపాల్‌ ఎం.వి.వి.ఎస్‌ మూర్తి తెలిపారు. 17 వ తేదీన గెలుపొందిన వారికి బహుమతి ప్రదానం జరుగుతుందన్నారు. ప్రారంభ మ్యాచ్‌ బాలికల విభాగంలో లక్ష్య స్కూల్‌, సామర్లకోటతో పాటు ఫోర్ట్‌ సిటీ స్కూల్‌ విజయనగరం మధ్య జరిగింది. ఈ పోటీలో ఫోర్ట్‌ సిటీ స్కూల్‌ విజయనగరం విజయం సాధించింది.

Published date : 16 Oct 2023 11:31AM

Photo Stories