Skip to main content

Sakshi Inspiring Teacher Award 2023 : మీకు ఇష్ట‌మైన టీచ‌ర్‌ను మీరే ఎంచుకోండి.. విద్యార్థుల‌కు సాక్షి ఎడ్యుకేష‌న్ సువ‌ర్ణావ‌కాశం..!

సాక్షి ఎడ్యుకేష‌న్ : భావి భారత పౌరుల నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తారు. వారి సహకారం లేకుండా ఏ సమాజం ప్రగతిశీల మార్గంలో అభివృద్ధి చెందిన‌ట్లు చ‌రిత్ర‌లో లేదు.
Supportive educators nurturing societal progress,Historical impact of educators on society's growth,sakshi education inspiring teacher awards news in Telugu ,Teacher guiding students towards a brighter future.
Sakshi Education Inspiring Teacher Awards 2023

విద్యార్థులను బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడంలో, వారి బంగారు భ‌విష్య‌త్తుకు బాట‌లు వేయ‌డంలో వీరి కృషి అనిత‌ర‌సాధ్యం. వారెవ‌రో కాదు గురువులు.

స్కూల్లో ప్రతి స్టూడెంట్‌కు ఇష్టమైన ఉపాధ్యాయులుంటారు. కొంద‌రికి లెక్కల సారు ఇష్టం. మ‌రికొంద‌రికి సోషల్‌ సారంటే ఇష్టం. ఆటల్లో గెంతే వారికి పీఈటీ సారంటే ఇష్టం. ఇష్టం లేని, కష్టమైన ప్రశ్నలు అడిగే సారంటే త‌ర‌గ‌తిలో ఉన్న విద్యార్థులంద‌రికీ ఇష్ట‌మే. 

అయితే సాక్షి ఎడ్యుకేష‌న్.. విద్యార్థులంద‌రికీ చ‌క్క‌టి అవ‌కాశాన్ని క‌ల్పిస్తోంది. మీకు ఇష్ట‌మైన టీచ‌ర్‌ను మీరే ఎన్నుకోవ‌చ్చు. మీరు ఇష్ట‌ప‌డుతున్న టీచ‌ర్‌కు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టొచ్చు. అయితే ఇందుకు మీరు చేయాల్సింద‌ల్లా మీ టీచ‌ర్‌ను నామినేట్ చేయ‌డ‌మే. 

రెండు తెలుగురాష్ట్రాల్లోని ఉపాధ్యాయులంద‌రూ ఈ పోటీకి అర్హులే. ఒక‌టి నుంచి ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు బోధించే టీచ‌ర్ల‌లో Inspiring Teacherను ఎంపిక చేసి వారికి "Inspiring Teacher Award" అంద‌జేస్తాం.

నామినేట్ ఎలా చేయాలంటే..?
☛ టీచ‌ర్ పేరు
☛ మీరు ఇష్ట‌ప‌డే టీచ‌ర్ బోధించే స‌బ్జెక్ట్‌
☛ స‌ద‌రు టీచ‌ర్ బోధించే తీరు, సుల‌భ ప‌ద్ధతుల‌తో అంద‌రికీ ఎలా అర్థ‌మ‌య్యేలా చెప్తారో ఆ చెప్పే విధానానికి 1 నుంచి 10 వ‌ర‌కు మార్కులు కేటాయించాలి.
☛ ఒక స‌బ్జెక్ట్‌లో ఒక‌రి కంటే ఎక్కువ మందిని కూడా నామినేట్ చేయొచ్చు.
☛ రెండు  తెలుగురాష్ట్రాల్లో అత్యధిక మార్కులు సాధించిన మొద‌టి ప‌దిమంది  టీచర్లకు సాక్షి డిజిటల్ మీడియా ప్రత్యేక గుర్తింపు ఇవ్వనుంది.

ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గెలుచుకోవడానికి ఈ అర్హ‌తలుండాలి..

విద్యార్థుల‌కు బోధించే తీరు సృజనాత్మకంగా ఉండాలి. ఏదైనా ఒక విష‌యాన్ని ఈజీగా ఉదాహ‌ర‌ణ‌ల‌తో చెప్పగ‌లుగుతుండాలి. అత్యంత క్లిష్ట‌మైన పాఠ్యాంశాల‌ను విద్యార్థులు సుల‌భంగా అర్థం చేసుకునేలా బోధ‌న తీరు ఉండాలి. ఉపాధ్యాయుల తీరు విద్యార్థుల‌తో పాటు తోటి ఉపాధ్యాయుల‌కు ఇన్ఫిరేష‌న్‌లా ఉండాలి. ఇంకెందుకు ఆల‌స్యం ఇప్పుడే.. https://forms.gle/oSdMkpF4Zt2LGMxHA ఈ లింక్ క్లిక్ చేసి మీ Inspiring Teacherకి Award ఇప్పించ‌డంలో మీరు భాగస్వామ్యులు అవ్వండి. పూర్తి వివ‌రాలకు www.sakshieducation.comలో చూడండి.

గ‌మ‌నిక : విద్యార్థులు త‌మ నామినేషన్లను సెప్టెంబ‌ర్ 5వ తేదీ లోపు పంపాలి.

Published date : 29 Aug 2023 05:39PM

Photo Stories