School Holidays: విద్యాసంస్థలకు సెలవు.. సోమవారం సైతం విద్యాసంస్థలకు సెలవు?
ఇప్పటికే జూలై 20, 21, 26 తేదీల్లో ప్రభుత్వం సెలవులు ప్రకటించగా 22, 24, 25 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లు పనిచేసినా దాదాపు 80 శాతం మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జూలై 29న మొహర్రం సెలవు కాగా వర్షాలు, వరదల వల్ల నెలకొన్న ఇబ్బందులు కుదుటపడకపోతే జూలై 31 సైతం విద్యాసంస్థలు పనిచేయడం కష్టమని అధికారులు అంటున్నారు.
చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2023 | టైం టేబుల్ 2023 | స్టడీ మెటీరియల్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | ఏపీ టెన్త్ క్లాస్
వర్షాలు తగ్గినా బోధన ఎలా?
పాఠశాల విద్యాశాఖ వివరాల ప్రకారం ఇప్పట్లో సజావుగా బోధన సాగే అవకాశం లేదని తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5 వేల స్కూళ్లలో కుండపోత వర్షాల వల్ల గదుల్లోకి, స్కూల్ ప్రాంగణాల్లోకి వరదనీరు చేరింది. దాదాపు 3 వేల స్కూళ్ల ఆవరణలో బురద పేరుకుపోయింది. 6,200 స్కూళ్లలో గోడలు చెమ్మపట్టడంతోపాటు విద్యుత్ బోర్డుల్లోకి నీరు చేరింది. 78 శాతం స్కూళ్లలో వర్షాలు తగ్గినా మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయలేని పరిస్థితి నెలకొంది.
ప్రభుత్వ హాస్టళ్ల నుంచి చాలా మంది ఇళ్లకు వెళ్లిపోయారు. బడులు తెరిచినా గ్రామీణ ప్రాంతాల్లో చాలాచోట్ల రవాణా వ్యవస్థ దెబ్బతిన్నందువల్ల వారంపాటు వారు తిరిగి రావడం కష్టమని అధికారులు భావిస్తున్నారు. వర్షాల నేపథ్యంలో డెంగీ, మలేరియా, అంటువ్యాధులు ప్రబలే ఆస్కారం ఉందని వైద్య, ఆరోగ్య శాఖ హెచ్చరిస్తోంది. తాగునీరు కలుషితం అయ్యే అవకాశం ఉన్నందువల్ల స్కూళ్లు, హాస్టళ్ల విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై మండలస్థాయి ప్రకారం నివేదికలు తెప్పించుకోవాలని సిబ్బందిని ఉన్నతాధికారులు ఆదేశించారు.