Half Day Schools in AP 2024 : రేపటి నుంచే.. ఏపీ ఒంటిపూట బడులు.. టైమింగ్స్ ఇవే.. వేసవి సెలవుల తేదీలు ఇవే..!
ప్రభుత్వ, జిల్లా పరిషత్, మున్సిపల్, మోడల్‌స్కూల్స్, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలు, గుర్తింపు పొందిన అన్‌ఎయిడెడ్ పాఠశాలల మేనేజ్‌మెంట్‌లలో ఒంటి పూట బడులు పక్కాగా అమలు కావాల్సిందేనని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు.
ఆ తర్వాతే పిల్లలు ఇంటికి..
ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్నం భోజనం ‘జనగన్న గోరుముద్ద’ అందజేయనున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం సీనియస్‌గా తీసుకుంది. బడుల్లో భోజనం చేసిన తర్వాతే విద్యార్థులను వారి ఇళ్లకు పంపిస్తారు. ఒంటిపూట బడుల సమయంలోనూ నిర్దేశించిన మెనూ ప్రకారమే భోజనాలు అందించాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు..
ఏప్రిల్ 23వ తేదీ వరకు ఒంటిపూట బడులు వర్తిస్తాయని ప్రభుత్వం పేర్కొంది. అయితే పదో తరగతి పరీక్ష కేంద్రాలుగా ఉన్న పాఠశాలల్లో పరీక్షలు జరిగే ఏడు రోజులపాటు 1 నుంచి 9 తరగతుల విద్యార్థులకు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు క్లాసులు నిర్వహించాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఒంటిపూట బడులను నిర్వహించాల్సిందేనని జిల్లా విద్యాశాఖాధికారి కె.వెంకటేశ్వరరావు సూచిస్తున్నారు. విద్యాశాఖ నిర్దేశించిన పలు ఆదేశాలు/సూచనలను ఆయన పాఠశాలలకు చేరవేశారు. ఏప్రిల్ 24వ తేదీ నుంచి వేసవి సెలవులు రానున్నాయి. ఈ సారి దాదాపు 50 రోజులు పాటు వేసవి సెలవులు రానున్నాయి.
పాఠశాలల్లో ఈ సూచనలు తప్పనిసరి..
☛ పాఠశాలలో బహిరంగ ప్రదేశాల్లో/ చెట్ల కింద తరగతులు నిర్వహించరాదు.
☛ అన్ని పాఠశాలల్లో తగినంత తాగునీరు అందుబాటులో ఉంచాలి.
☛ ఎండల నేపధ్యంలో విద్యార్థుల ఉపయోగం కోసం ప్రతి పాఠశాలలో కొన్ని ఓరల్ రీ–హైడ్రేషన్ సొల్యూషన్ (ఓఆర్‌ఎస్) ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలి.
☛ బడుల్లో సన్/హీట్ స్ట్రోక్ బారిన పడితే, వైద్య–ఆరోగ్య శాఖ సమన్వయంతో పనిచేయాలి. ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను ఉపయోగించాలి.
☛ మధ్యాహ్న భోజన సమయంలో స్థానికుల సమన్వయంతో మజ్జిగ అందించాలి.
☛ ఎస్‌ఏ–2 పరీక్షల షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులు లేవని పాఠశాల విద్యాశాఖ పేర్కొంది.
2024లో సెలవులు వివరాలు ఇవే...
☛ 25-03-2024 (సోమవారం) హోలీ
☛ 29-03-2024 (శుక్రవారం) గుడ్ ఫ్రైడే
☛ 05-04-2024 (శుక్రవారం) (బాబు జగ్జీవన్ రామ్ జయంతి)
☛ 09-04-2024 (మంగళవారం) ఉగాది
☛ 11-04-2024 (గురువారం) ఈద్ ఉల్ ఫితర్
☛ 17-04-2024 (బుధవారం) శ్రీరామనవమి
☛ 17-06-2024 (సోమవారం) బక్రీద్
☛ 17-07-2024 (బుధవారం) మొహర్రం
☛ 15-08-2024 (గురువారం) స్వాతంత్ర్య దినోత్సవం
☛ 26-08-2024 (సోమవారం) శ్రీ కృష్ణాష్టమి
☛07-09-2024 (శనివారం) వినాయకచవితి
☛ 16-09-2024 (సోమవారం) ఈద్ మిలాద్ ఉన్ నబి
☛ 02-10-2024 (బుధవారం) గాంధీ జయంతి
☛ 11-10-2024 (శుక్రవారం) దుర్గాష్టమి
☛ 31-10-2024 (గురువారం) దీపావళి
☛ 25-12-2024 (బుధవారం) క్రిస్మస్
Tags
- school summer holidays 2024 andhra pradesh
- school summer holidays 2024 andhra pradesh in telugu news
- half day schools in andhra pradesh 2024
- half day schools news telugu 2024
- half day schools news telugu 2024 ap
- summer holidays in ap 2024
- summer holidays in ap 2024 telugu news
- ap school half days 2024 dates
- ap school half days 2024 dates news telugu
- summer holidays 2024
- Government Holidays
- summer holidays 2024 list andhra pradesh
- ap school half days 2024 time table
- Andhra Pradesh school schedule
- March 18 education announcement
- Sakshi Education announcement