Nadu-Nedu Scheme: ప్రభుత్వ బడులు ఇప్పుడు కార్పొరేట్ స్కూల్స్‌గా
Sakshi Education
జగనన్న ప్రభుత్వం ప్రారంభించిన నాడు-నేడు పథకంతో విద్యార్థులకు పాఠశాలల్లో ఉన్నత విద్య దక్కుతుందని ఎంపీ తెలిపారు.
తూర్పు గోదావరి: నాడు –నేడు పేరుతో ప్రభుత్వ బడులను కార్పొరేట్ స్కూల్స్‌గా మార్చిన ఘనత జగన్ననకే దక్కుతుంది. సామాన్య ప్రజలు అప్పు చేసి తమ పిల్లలను ప్రైవేట్ స్కూల్స్‌లో చదివించేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.
ISRO Opportunity: విద్యార్థులకు ఇస్రో కల్పిస్తున్న గొప్ప అవకాశం..
ఇంగ్లిష్ మీడియం విద్యతో పాటు, ట్యాబ్‌ల పంపిణీ చేసి బైజూస్ వంటి టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువచ్చారు. మహిళలకు అమ్మ ఒడి పథకం ద్వారా అందుతున్న సహాయం ఎందరో విద్యార్థినులు చదువును కొనసాగించేందుకు ఉపయోగపడుతోంది.
– మార్గాని భరత్‌రామ్, ఎంపీ, రాజమహేంద్రవరం
Published date : 24 Feb 2024 03:16PM