Skip to main content

5 Days Schools and Colleges Holidays in August 2024 : ఈ నెల‌లో ఆ ఒక్కరోజు సెల‌వు తీసుకుంటే..వరుసగా 5 రోజులు సెలవులు.. ఎలా అంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆగ‌స్టు నెల‌లో స్కూల్స్, కాలేజీలు, ఉద్యోగుల‌కు గుడ్‌న్యూస్‌. ఈ నెల‌లో వ‌రుస‌గా 5 రోజులు పాటు సెల‌వులు రానున్నాయి. అయితే.. ఈ ఐదు రోజుల్లో నాలుగు రోజులు సెలవులు ఉండగా.. మధ్యలో ఒక్క రోజు సెల‌వు తీసుకుంట.. మొత్తంగా 5 రోజుల పాటు సెల‌వులు వ‌స్తాయి. ఆగస్టు 15వ‌ తేదీ నుంచి ఆగస్టు 19వ తేదీ వరకు 5 రోజుల పాటు సెలవులు రానున్నాయి.
Five Days Schools and Colleges Holidays in August 2024

దీంతో కేవలం స్కూల్, కాలేజీ పిల్లలకే కాదు.. ఉద్యోగులకు కూడా భారీగా సెలవులు దొరికే అవకాశం ఉంది. ఉద్యోగులు అయితే.. మధ్యలో ఒక్కరోజు సొంతంగా సెలవు పెట్టుకోగలిగితే మాత్రం.. వరుసగా ఐదు రోజుల పాటు సెల‌వులు రానున్నాయి.

☛➤ Schools and Colleges Holidays in August 2024 : ఆగస్టు నెల‌లో స్కూల్స్, కాలేజీల‌కు దాదాపు 10 రోజులు సెల‌వులు..! ఎందుకంటే..?

వ‌రుస‌గా 5 రోజుల పాటు సెల‌వులు ఎలా అంటే..?

colleges holidays news august 2024

ఆగస్టు 15వ తేదీ (గురువారం) స్వాతంత్య్ర దినోత్సవం రోజున స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసుల‌కు సెల‌వు ఉన్న విష‌యం తెల్సిందే. కొన్ని ప్ర‌భుత్వ‌, ప్రైవేట్‌ ఆఫీసులకు, కాలేజీలకు అయితే ఆరోజును ముందే సెల‌వు ప్రకటించేస్తారు. కానుక‌ ఆరోజు సెలవు కిందికే పరిగణలోకి వస్తుంది. ఆ తర్వాత రోజు ఆగస్టు 16న శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం. ఆ రోజున చాలా వరకు స్కూళ్లు, ఆఫీసులకు సెలవు ప్రకటిస్తారు. దీంతో ఇప్ప‌టికి 15, 16 రెండు రోజులు విద్యార్థులు, ఉద్యోగులకు వరుస సెలవులు రానున్నాయి.

➤☛ Telangana School Holidays List 2024-25 : 2024-25 విద్యా సంవత్సర క్యాలెండర్ విడుద‌ల‌.. ఈ ఏడాది సెల‌వులే సెల‌వులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

➤☛ Schools and Colleges Dasara & Sankranti Festivals Holidays 2024 : ఈ సారి భారీగా స్కూల్స్‌, కాలేజీల‌కు దసరా, సంక్రాంతి సెల‌వులు ప్రకటించిన ప్రభుత్వం.. మొత్తం ఎన్ని రోజులంటే..?

ఎలాగూ ఆ రోజు సెల‌వే..

holidays news august 2024 telugu

అలాగే.. ఆగస్టు 18వ తేదీన‌ ఆదివారం కావటంతో ఎలాగూ ఆ రోజు సెల‌వే. ఇక ఆగ‌స్టు 19వ తేదీన రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆరోజు కూడా స్కూళ్లు, కాలేజీలు, ఉద్యోగులకు సెలవు ఇవ్వనున్నారు. దీంతో మరో రెండు రోజులు సెలవులు వస్తున్నాయి. అయితే.. 15, 16, 18, 19 ఎలాగు సెలవులు ఉన్నాయి. మధ్యలో ఆగస్టు 17వ తేదీ శనివారం ఆ ఒక్క రోజు మాత్రమే వర్కింగ్ డే ఉంటుంది. అది కూడా స్కూళ్లు, కాలేజీలు, కొన్ని కంపెనీలకు మాత్రమే. ఎలాగూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు శనివారం ఎలాగు వీకెండ్‌. అయితే.. 17 రోజున ఆఫీసు కానీ, స్కూళ్లు, కాలేజీలు ఉన్న వాళ్లు ఆ ఒక్క రోజున హాలీడే  తీసుకుంటే.. వరుసగా 5 రోజులు సెలవులు కలిసి వస్తాయి. 

☛➤ August 21st Schools and Colleges Closed : విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. ఆగ‌స్టు 21న స్కూల్స్ బంద్..? కార‌ణం ఇదే..!

Published date : 08 Aug 2024 06:02PM

Photo Stories