Free Workbooks: విద్యార్థులకు ఉచితంగా వర్క్‌బుక్స్
మారుతున్న కాలనుగుణంగా బోధన విధాన విధానాలను మార్చేందుకు చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా ఇటీవల ఆరు రోజులపాటు ఎఫ్‌ఎల్‌ఎన్(ఫౌండేషన్, లిటరసీ, న్యూమరసీ) కార్యక్రమంలో భాగంగా టీచర్లకు అవగాహన తరగతులు నిర్వహించారు. అంతేకాక 2023– 24 విద్యా సంవత్సరంలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలతోపాటు వర్క్‌బుక్స్ అందిస్తున్నారు.
చదవండి: Govt Junior Colleges: ఇంటర్ విద్యార్థులకు అందని పాఠ్యపుస్తకాలు
ప్రాథమిక విద్య బలోపేతం..
ప్రాథమిక దశలోనే విద్యాపునాది పటిష్టంగా ఉంటే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. కాలం చెల్లిన బోధనా విధానాలతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పోటీ ప్రపంచంలో నెగ్గుకురాలేరు. దీనిని గుర్తించిన ప్రభుత్వం గతేడాది నుంచి తొలిమెట్టు పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తోంది.
అలాగే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలతోపాటు అభ్యసన పుస్తకాలు(వర్క్‌బుక్స్), కథల పుస్తకాలు అందిస్తోంది. వీటి ద్వారా 5 1 విధానంలో బోధించనున్నారు. ఈ విధానం ఇప్పటికే లోకల్‌బాడి పాఠశాలల్లో ప్రారంభమైంది.
చదవండి: Seva Bharat Trust: విద్యార్థులకు ఉచితంగా నోటు పుస్తకాలు, బ్యాగుల పంపిణీ
బోధన ఇలా..
జిల్లాలో మొత్తం 500 ప్రాథమిక పాఠశాలలు ఉండగా, 103 ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయి. ఆయా పాఠశాలలకు సాధారణంగా ఒక విద్యా సంవత్సరంలో సరాసరి 220 పనిదినాలు ఉంటాయి. ఇందులో 140 రోజులు పాఠ్యాంశాల బోధనకు సరిపోతాయని నిపుణులు చెబుతున్నారు. మిగిలిన రోజుల్లో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు పెంచేందుకు కృత్యాధారణ బోధన చేపట్టాలని విద్యాశాఖ వర్క్‌బుక్స్ అందిస్తోంది.
5 1 బోధన అంటే.. వారంలో ఐదు రోజులు తరగతులు, ఒకరోజు అభ్యసనాలు చేయించడం ఉంటుంది. తెలుగు, ఇంగ్లిష్, గణితం సబ్జెక్టులకు 90 నిమిషాల సమయం ఉంటే, అందులో 40 నిమిషాలు విద్యార్థులను ఆకట్టుకునేలా పాఠం బోధించాలి. ఆ తర్వాత 15 నిమిషాలు వర్క్‌బుక్ రాయించాలి. అలాగే మరో 15 నిమిషాల పాటు విద్యార్థులకు ఆసక్తి కలిగే కథ చెప్పాల్సి ఉంటుంది. ఏ రోజు చెప్పిన పాఠం ఆరోజే విద్యార్థులతో వర్క్‌బుక్ రాయించాలి.
గ్రూపులుగా విభజన..
తరగతిలోని విద్యార్థులను మూడు గ్రూపులుగా విభజిస్తారు. ఫార్మార్మర్, మీడియం, టీచర్ సపోర్ట్ అనే గ్రూపులు ఏర్పాటు చేశారు. విద్యార్థులందరూ ఫా ర్మార్మర్ గ్రూపులోకి వచ్చేలా గుణాత్మకంగా కృత్యాధార బోధన చేయాలి. అభ్యసన సామర్థ్యాలు మెరుగుపర్చాల్సి ఉంటుంది.
గతంలో పాఠ్యప్రణాళికలు రూపొందించుకుని రెండు ఫార్మటివ్ అసెస్‌మెంట్, నాలుగు సమ్మెటివ్ అసెస్‌మెంట్ పరీక్షలు నిర్వహించేవారు. ప్రస్తుతం ప్రతీవారం పాఠ్యాంశాలకు సంబంధించిన సమాధానాలు రాయాల్సి ఉంటుంది.