Essay Writing for students: మండల స్థాయిలో వ్యాసరచన పోటీలు
సాక్షి ఎడ్యుకేషన్: మండల స్థాయి వ్యాసరచన పోటీలు ఆదివారం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శ్రీమత్స్య మాడుగులమ్మ ఆలయ ఆధ్వర్యంలో జరిగాయి. ఎస్‌ఐ శ్రీనివాస్ వ్యాసరచన పోటీలను ప్రారంభించి అభ్యర్థులకు తగిన సూచనలు ఇచ్చారు. సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలు, మత్తు పదార్థాల వల్ల అనర్థాలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. గంజాయి వంటి పంటలకు దూరంగా ఉండాలని ఆయన తెలియజేశారు. సమాజంలో జరుగుతున్న వివిధ రకాలు అంశాలపై అవగాహన ఉండాలన్నారు. యువతలో సామాజిక బాధ్యత కోసం మత్స్యమాడుగులమ్మ యూత్ వ్యాసరచన పోటీలను ఏర్పాటు చేయటంపై ఆయన అభినందించారు.
Andhra University: ఏయూలో ప్రారంభం కానున్న తరగతులు
వ్యాసరచన పోటీలకు 156మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ పోటీల్లో విజేతలకు ఈ నెల 20న నగదు, షీల్డ్ బహుమతులు అందజేస్తామని నిర్వహాకులు తెలిపారు. ఎంపీటీసీ సభ్యురాలు మత్స్యరాస విజయకుమారి, డాక్టర్ ఎం.సౌజన్యదేవి, లక్ష్మణ్, ఎం.శ్రీనివాసరాజు, సొలభం సత్యనారాయణ ఆర్థిక సహాయం చేశారు. మత్స్యమాడుగులమ్మ యూత్ నాయకులు, నిర్వాహకులు ప్రసాద్, జయసింహరాజు, రామకృష్ణంరాజు, ప్రదీప్‌చంద్, గోపాల్‌రాజు, అఖిల్,వలసయ్య, శరత్‌కుమార్, చిన్నరాజు, సాయి తదితరులు పాల్గొన్నారు.