Skip to main content

Tomorrow School Holiday : రేపు స్కూల్స్‌కు సెల‌వు.. ఎందుకంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఈ ఏడాది స్కూల్స్‌కి అనుకోని సెల‌వులు చాలానే వ‌చ్చాయి. జూన్‌, జూలై, ఆగ‌స్టు నెల‌లో కురిసిన వాన‌ల‌కు స్కూల్స్‌, కాలేజీల‌కు భారీగానే సెల‌వులు ఇచ్చిన విష‌యం తెల్సిందే. అలాగే బంద్‌ల రూపంలో కూడా సెల‌వులు వ‌చ్చాయి.
Ganesh Immersion in Hyderabad 2023 News in telugu, School closure due to bandh,Rainy day break from school
Ganesh Immersion in Hyderabad 2023

ఇప్పుడు తాజాగా వినాయక నిమజ్జనం సంద‌ర్భంగా  హైద‌రాబాద్‌లోని చాలా స్కూల్స్‌కు సెప్టెంబ‌ర్ 27వ తేదీన‌(గురువారం) సెల‌వు ప్రకటించారు. ముఖ్యంగా హుస్సేన్ సాగర్‌లో జరిగే ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జనానికి చూడటానికి లక్షలాదిగా భక్తులు తరలివస్తారు. వినాయక నిమజ్జనం సంద‌ర్భంగా రేపు నగరమంతా పండగ వాతావరణం నెలకొంటుంది.

☛ Schools & Colleges Holidays October 2023 List : అక్టోబ‌ర్ నెల‌లో స్కూల్స్‌, కాలేజీల‌కు అత్యంత భారీగా సెల‌వులు.. మొత్తం ఎన్ని రోజులంటే..?

హైదరాబాద్ లో గణేశ్ చతుర్థి అంటే దేశవ్యాప్తంగా ఫేమస్. చాలామంది చూపు ఇటువైపు ఉంటుంది. అలాగే వినాయక నిమజ్జనం అంటే.. ప్ర‌తి ఏడాది జ‌నాలు ట్యాంక్‌బండ్ వైపుకు ల‌క్షల మంది వ‌స్తుంటారు. హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలతో పాటు జీహెచ్ఎంసీ పరిధిలోకి వచ్చే రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్‌గిరి, సంగారెడ్డి జిల్లాలోని ప్రాంతాల్లో స్కూల్స్‌ సెలవులు ఇచ్చారు చాలా వ‌ర‌కు. ప్రభుత్వం కూడా సెలవు ప్రకటించే అవ‌కాశం. అలాగే హైద‌రాబాద్ ప‌రిధిలోని ప్రైవేట్ సంస్థ‌లు ఇప్ప‌టికే రేపు సెల‌వును ప్ర‌క‌టించారు.

☛ Four Days School & Colleges Holidays : వ‌రుస‌గా స్కూల్స్‌, కాలేజీల‌కు నాలుగు రోజులు పాటు సెల‌వులు.. ఎందుకంటే...?

హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలతో పాటు జీహెచ్ఎంసీ పరిధిలోకి వచ్చే ఇతర జిల్లాల ప్రాంతాలకు సైతం ప్రభుత్వం సెలవు ప్రకటించే అవ‌కాశం ఉంది. రేపు ట్రాఫిక్ ఆంక్షలు సైతం ఉన్నాయి. స్కూళ్లు, ఆఫీసులకు వెళ్లాలంటే.. విద్యార్ధులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. క‌నుక‌ ఈ కారణంతోనే ప్రభుత్వం సెలవు ప్రకటించే అవ‌కాశం ఉంది.

☛ Schools & Colleges Dussehra Holidays 2023 : తెలంగాణ‌, ఏపీలో భారీగా దసరా సెలవులు.. మొత్తం ఎన్ని రోజులు అంటే..?

తెలంగాణ 2023-24లో సెల‌వుల పూర్తి వివ‌రాలు ఇవే..:

☛ 2023-24 అకడమిక్‌ ఇయర్‌లో మొత్తం 229 రోజులపాటు పాఠశాలలు పనిచేయనున్నాయి
☛ బడుల్లో ప్రతి రోజూ ఐదు నిమిషాల పాటు యోగా, ధ్యానం చేయించాలి
☛ 2024 జనవరి పదవ తేదీ వరకు పదో తరగతి సిలబస్ పూర్తి చేయాలి
☛ 2024 మార్చిలో పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి
☛ అక్టోబర్ 13 నుంచి 25 వరకు దసరా సెలవులు
☛ జనవరి 12 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు
☛ ఒకటి నుంచి తొమ్మిది తరగతుల వరకు ఏప్రిల్ 8 నుంచి 18 వరకు ఎస్ఏ 2 పరీక్షలు
☛ 2024 ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ 2023-24లో సెల‌వుల పూర్తి వివ‌రాలు ఇవే..:

 

☛ అక్టోబర్ 14 నుంచి 24 వరకు దసరా సెలవులు
☛ జనవరి 9, 2024 నుంచి 18, 2024 వరకు సంక్రాంతి సెలవులు
☛ డిసెంబ‌ర్ 17వ తేదీ నుంచి 26వ తేదీ వ‌ర‌కు క్రిస్ట‌మ‌స్ సెల‌వులు (మిష‌న‌రీ స్కూల్స్‌కు మాత్ర‌మే..)
☛ ఇంకా దీపావ‌ళి, ఉగాది, రంజాన్ మొద‌లైన పండ‌గ‌ల‌కు ఆ రోజును బ‌ట్టి సెల‌వులు ఇవ్వ‌నున్నారు.

Published date : 28 Sep 2023 08:45AM

Photo Stories