Due to Heavy Rain Schools Holidays : తెలంగాణలో భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవులు.. అయిదు రోజులు పాటు..
బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, మెహదీపట్నం, నాంపల్లిలో జల్లులు పడుతున్నాయి. అల్పపీడన ప్రభావంతో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది. గత రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి.
నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలలకు జిల్లా విద్యాధికారి దుర్గాప్రసాద్ నేడు సెలవు ప్రకటించారు. భారీ వానలతో పలుచోట్ల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. అత్యధికంగా మోపాల్ మండలంలో 15.7 సెంటీమీటర్లు, ఇందల్వాయిలో 14.8, డిచ్‌పల్లి మండలం గన్నారంలో 14 సెంటీమీటర్ల వర్షం పడింది. 10 మండలాల్లో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది.
సిరికొండ మండలం తుంపల్లిలో 6 సెంటిమీటర్ల వర్షపాతం నమోదు కాగా.. చీమన్ పల్లి, గన్నారం, దర్పల్లి, కమ్మర్ పల్లి, మెండోరా , మోర్తాడ్ లో 5 సెంటిమీటర్ల వర్ష పాతం నమోదైంది. ఇక జిల్లాలో కురుస్తున్న కుండపోత వానలతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద పెరిగింది. దీంతో నాలుగు గేట్లు ఎత్తి అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు.
చదవండి: టిఎస్ ఇంటర్ - ఇంటర్ | టైం టేబుల్ 2023 | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | న్యూస్
మరో రెండు రోజులపాటు వర్షం కొనసాగే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. కామారెడ్డి జిల్లాలోనూ వర్షాలు పడుతున్నాయి. జిల్లా కేంద్రంతో పాటు తాడ్వాయి, బిక్కనూరు, మాచారెడ్డి, దోమకొండ, బీబీపేట, రాజంపేట సదాశివనగర్ మండలాల్లో భారీ వర్షం కురుస్తోంది.
వర్షాల ధాటికి పలు మండలాల్లో వరి పంట నీట మునిగింది. జిల్లా కేంద్రంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై భారీగా వర్షపు నీరు చెరడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. తాడ్వాయి మండలం బ్రాహ్మణపల్లి గ్రామ శివారులో వాగు పొంగిపొర్లుతోంది. వాగు ప్రవహించడంతో టేక్రియాల్, బ్రాహ్మణపల్లి, సంగోజి వాడి, కాలోజివాడి, చందాపూర్ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
చదవండి: టిఎస్ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2023 | టైం టేబుల్ 2023 | స్టడీ మెటీరియల్ | సిలబస్ | బిట్ బ్యాంక్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | ఏపీ టెన్త్ క్లాస్
అంతేగాక తాడ్వాయి మండలం సంతయిపేట గ్రామ శివారులోని భీమేశ్వర వాగు, పాల్వంచ మండలం వాగు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో భారీ వర్షం కురుస్తున్నది. సంగారెడ్డి జిల్లా కంగ్టిలో అత్యధికంగా 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. మెదక్ జిల్లా కౌడిపల్లిలో 8.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
అయిదు రోజులు పాటు..
అల్పపీడన ప్రభావంతో వచ్చే అయిదు రోజులపాటు తెలంగాణలో భారీ నుంచి అతిభారీ వర్షాలు వర్షాలు కురిసే అవకాశముందని హైదాబాద్ వాతావరణశాఖ తెలిపింది. నేడు, రేపు నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, మహబూబ్‌నగర్, మెదక్, నారాయణపేట, నిజామాబాద్,పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, వికారాబాద్ ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది.
అదిలాబాద్, హనుమకొండ, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, గద్వాల్,కొమరం భీం, మహబూబబాద్,మంచిర్యాల, ములుగు, నాగర్ కర్నూలు, నల్గొండ, నిర్మల్, రంగా రెడ్డి, సిద్దిపేట, సూర్యా పేట, వనపర్తి, వరంగల్, యాదాద్రి భువనగిరి ఎల్లో అలెర్ట్ ఇచ్చింది. హైదరాబాద్ నగరంలో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
తెలంగాణలో 2023-24 అకడమిక్ ఇయర్‌లో పరీక్షలు- సెలవులు..
☛ 2023-24 అకడమిక్ ఇయర్‌కు సంబంధించి మొత్తం 229 పనిదినాలు ఉన్నాయి.
☛ బడుల్లో ప్రతి రోజూ ఐదు నిమిషాల పాటు యోగా ధ్యానం చేయించాలి
☛ 2024 జనవరి పదవ తేదీ వరకు పదో తరగతి సిలబస్ పూర్తి చేయాలి
☛ 2024 మార్చిలో పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి
☛ అక్టోబర్ 14 నుంచి 25 వరకు దసరా సెలవులు
☛ జనవరి 12 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు
☛ ఒకటి నుంచి తొమ్మిది తరగతుల వరకు ఏప్రిల్ 8 నుంచి 18 వరకు ఎస్ఏ 2 పరీక్షలు
☛ 2024 ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు వేసవి సెలవులుగా అకడమిక్ ఇయర్ క్యాలెండర్‌లో పేర్కొంది తెలంగాణ ప్రాథమిక విద్యాశాఖ.
దాదాపు 10 రోజులు స్కూల్స్, కాలేజీలకు పాటు..
జూలై నెలలో కురిసిన భారీ వర్షాలకు దాదాపు స్కూల్స్, కాలేజీలకు 10రోజులు వరకు సెలవులు ఇచ్చిన విషయం తెల్సిందే. ఇప్పుడు తాజాగా సెప్టెంబర్ నెలలో కురిసే ఈ భారీ వర్షాలకు కూడా స్కూల్స్,కాలేజీలకు సెలవులు ఇచ్చే అవకాశం ఉంది. ఈ ఏడాది భారీ వర్షాల కారణంగా స్కూల్స్, కాలేజీలకు సెలవులు భారీగానే వచ్చాయి. ఈ సెలవులు కారణంగా ఉపాధ్యాయులు మాత్రం సిలబస్‌ను టైమ్‌కు పూర్తి చేయడంలో ఇబ్బందులు పడుతున్నారు.
ఏపీలోని స్కూల్స్ కూడా..
ఆంధ్రప్రదేశ్ రేపు, భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. బలంగా గాలులు వీస్తాయని, ఎల్లుండి సైతం భారీ వానలు ఉంటాయని అప్రమత్తం చేస్తోంది. ఇంకా ఆంధ్రప్రదేశ్‌లో కూడా విద్యాశాఖ అధికారులు స్కూల్స్ సెలవులు ఇచ్చే ఆలోచనలో ఉన్నారు. ఈ విషయంలో ఇంకా స్పష్టమైన క్లారిటీ ఇవ్వలేదు.
చదవండి: ఏపీ టెన్త్ క్లాస్ - మోడల్ పేపర్స్ 2023 | టైం టేబుల్ 2023 | ముఖ్యమైన ప్రశ్నలు | స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సిలబస్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్
ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ జోన్ పరిధిలో(సెప్టెంబర్ 4 వ తేది) కర్నూల్ APSP2 వ బెటాలియన్ లో సోమవారం జరగాల్సిన ఎస్సై అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలను భారీ వర్షం కారణంగా వాయిదా వేస్తున్నట్లు కర్నూల్ రేంజ్ డీఐజీ సెంథిల్ కుమార్ తెలిపారు. ఈ పరీక్షలను సెప్టెంబరు 21 తేదికి వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ఈ ఏడాది (2023-24) సెలవులు ఇలా..
☛ అక్టోబర్ 14 నుంచి 24 వరకు దసరా సెలవులు
☛ జనవరి 9, 2024 నుంచి 18, 2024 వరకు సంక్రాంతి సెలవులు
☛ డిసెంబర్ 17వ తేదీ నుంచి 26వ తేదీ వరకు క్రిస్టమస్ సెలవులు (మిషనరీ స్కూల్స్‌కు మాత్రమే..)
☛ ఇంకా దీపావళి, ఉగాది, రంజాన్ మొదలైన పండగలకు ఆ రోజును బట్టి సెలవులు ఇవ్వనున్నారు.
Tags
- due to heavy rain schools holidays in Telangana
- heavy rain in ap news telugu
- Telangana schools holidays
- schools holidays due to rain
- Schools Holidays News
- TS Schools Holidays
- ap schools holidays 2023
- due to heavy rain schools holidays
- heavy rain schools holidays
- heavy rain school holiday telangana
- telangana declared holiday due to rain
- telangana declared holiday due to rain today