ST Hostel Students: విద్యార్థులతో పనులు చేయిస్తారా?
Sakshi Education
చిన్నశంకరంపేట(మెదక్): మండల కేంద్రంలోని ఎస్టీ హాస్టల్‌లో వర్కర్స్ చేయాల్సిన పనులు విద్యార్థులతో చేయిస్తున్నారని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ప్రవీణ్, సంతోష్ అన్నారు. బుధవారం ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సైకిల్‌యాత్ర చిన్నశంకరంపేటకు చేరుకుంది. ఈసందర్భంగా మండల కేంద్రంలోని ఎస్టీ హాస్టల్, కస్తూర్బా పాఠశాలను సందర్శించి మాట్లాడారు. పేద విద్యార్థులు చదువుకునే హాస్టల్‌లో వసతులు కల్పించాలని కోరారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షుడు జగన్, అజయ్, నవీన్, రమేష్ పాల్గొన్నారు.
Additional Collector Yadireddy: పిల్లలతో పనిచేయిస్తే కఠిన చర్యలు
Published date : 27 Jul 2023 03:39PM