School Games Federation: రైఫిల్ షూటింగ్‌కు 54 మంది విద్యార్థులు
తిరుపతి కల్చరల్: జిల్లా స్థాయి రైఫిల్ షూటింగ్ పోటీలలో ఉత్తమ ప్రతిభతో 54 మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయి రైఫిల్ షూటింగ్ పోటీలకు ఎంపికయ్యారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఎస్‌పీజేఎన్‌ఎం స్కూల్లో శుక్రవారం అండర్–14, 17, 19 విభాగాలలో జిల్లా స్థాయి రైఫిల్ షూటింగ్ పోటీలు శుక్రవారం నిర్వహించారు. ఈ పోటీలలో అండర్ –14 విభాగంలో 18 మంది, అండర్–17 విభాగంలో 18 మంది, అండర్ –19 విభాగంలో 18 మంది మొత్తం 54 మంది ఎంపికై నట్లు ఫెడరేషన్ కార్యదర్శి పి.విజయకుమారి తెలిపారు. జిల్లా స్థాయి పోటీలలో ఎంపికై న వారు ఈనెల 28, 29, 30వ తేదీలలో రాజమండ్రి ఇంటర్నేషనల్ స్కూల్లో జరుగనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. రైఫిల్ షూటింగ్‌కు ఎంపికై న వారిలో మారుతీనగర్, కొర్లగుంట శ్రీవారి హైస్కూల్‌కు చెందిన విద్యార్థి బి.యశ్వంత్ కృష్ణ ఉన్నారు. టీమ్ మేనేజర్ కె.సుధ, స్కూల్ ప్రిన్సిపల్ బాలక్రిష్ణయ్య, పీఈటీ శివ, యాజమాన్యం,వి ద్యార్థులకు పది రోజులపాటు కోచింగ్ ఇచ్చి తీర్చిదిద్దిన వారిని జాతీయ రైఫిల్ షూటింగ్ అసోసియేషన్ కార్యదర్శి దేవరాజు అభినందలు తెలియజేశారు.
చదవండి: CBSE: సీబీఎస్‌ఈ విధానంపై అవగాహన తరగతులు