Skip to main content

Jawahar Navodaya Vidyalayas: విద్యాల‌య ప్ర‌వేశానికి జాతీయ స్థాయిలో ప‌రీక్ష‌లు..

జ‌వ‌హర్ న‌వోద‌య విద్యాల‌యంలో ప్ర‌వేశానికి జాతీయ స్థాయిలో ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు అధికారులు. ఈ ప్ర‌వేశాల‌లో విద్యార్థుల‌కు కావాల్సిన అర్హ‌త‌ల‌ను గురించి కూడా వివ‌రించారు.
Admissions at Navodaya Schools
Admissions at Navodaya Schools

సాక్షి ఎడ్యుకేషన్‌: జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో 2024–25 విద్యా సంవత్సరంలో 9, 11వ తరగతుల్లో ప్రవేశానికి 2024 ఫిబ్రవరి 10వ తేదీన జాతీయ స్థాయిలో నిర్వహించే పరీక్షలకు దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 31వ తేదీ వరకు అవకాశం ఉంటుందని కోచింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్‌ యన్‌.విశ్వనాథ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలియజేశారు.

Degree Colleges: డిగ్రీ కోర్సుల్లో స్పాట్ అడ్మిష‌న్లు

9వ తరగతిలో ప్రవేశానికి ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఈ ఏడాది 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు మే 1, 2009 నుంచి జూలై 31 2011 మధ్య జన్మించిన బాలబాలికలు అర్హులని తెలిపారు. 11వ తరగతిలో ప్రవేశానికి ప్రస్తుతం 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు 2007 జూన్‌ 1 నుంచి 2009 జూలై 31 మధ్యన జన్మించిన వారై ఉండాలన్నారు. ఇతర వివరాలకు 86888 88802, 93999 76999నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు. పరీక్ష 2024 ఫిబ్రవరి 10వ తేదీన ఉంటుందన్నారు.

Published date : 16 Oct 2023 04:31PM

Photo Stories