School Examinations : విద్యా పరీక్షల నిర్వహణలో మార్పులపై ప్రభుత్వానికి డిమాండ్..!
అమలాపురం: పాఠశాల విద్యా క్యాలెండర్ ప్రకారం జూన్– సెప్టెంబర్ నెలలకు సంబంధించి 85 రోజుల పనిదినాల్లో వరదలు, వర్షాలు, తుపాన్‌లతో 10 నుంచి 15 రోజులు ఉపాధ్యాయులు నష్టపోయారని ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు (ఐవీ) ప్రభుత్వానికి గుర్తు చేశారు. ఈ కారణాలతో పాఠశాల విద్యా పరీక్షల నిర్వహణలో కొన్ని మార్పులు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Road Transport and Highways: తెలంగాణలో బైపాస్ నిర్మాణానికి రూ.516 కోట్లు.. ఏపీలో కూడా..
ఈ మేరకు ఆయన అమలాపురంలో సోమవారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రకృతి వైపరీత్యాలతో కొన్ని రోజులు నష్టపోతే, మరో వైపు కాంప్లెక్స్ సమావేశాలు, శిక్షణ తరగతులు, యాప్‌ల మేనేజ్‌మెంట్‌ల పేరుతో అకడమిక్ పనిగంటలు కూడా ఎన్నో నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
ఈ మేరకు విద్యార్థులకు నష్టం అనివార్యమైందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని సబ్జెక్ట్ పుస్తకాలు జూలైలో సరఫరా చేశారని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో పరీక్షల నిర్వహణలో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరాన్ని ఆయన సూచించారు.
సెల్ప్ అసెస్‌మెంట్ –2 పరీక్షలకు ఆగస్టు నెల సిలబస్ తీసుకోవాలన్నారు. సెల్ప్ అసెస్‌మెంట్ –2 పరీక్షలు రోజుకు రెండు చొప్పున నిర్వహించాలన్నారు. సీబీఏ పరీక్ష పేపరు పేరు మార్చి సెల్ప్ అసెస్‌మెంట్ మోడల్ పేపర్‌ను యూనిట్ టెస్ట్ మాదిరిగా డీసీఈబీ ద్వారా నిర్వహించాలని ఎమ్మెల్సీ ఐవీ డిమాండ్ చేశారు. తాను సూచించిన విషయాలను పరిశీలించి సంబంధిత ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు.
Nobel Prize in Economics: అర్థశాస్త్రంలో ముగ్గురికి నోబెల్ అవార్డు.. ఎవరెవరికంటే..