District Competitions: జిల్లా స్థాయిలో విద్యావనరులకు తెలుగు ప్రతిభా పోటీలు.
![Success-Linked Rewards in District-Level Competitions,telugu language day competitions ,District-Level Competitions with Achievement Rewards,](/sites/default/files/images/2023/08/28/telugu-language-day-1693216621.jpg)
సాక్షి ఎడ్యుకేషన్: తెలుగు భాషాదినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత్ పరిషత్ జిల్లాశాఖ, జిల్లా విద్యాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో 29వ తేదీ ఉదయం 10 గంటలకు కడపలోని విద్యావనరుల కేంద్రంలో జిల్లాస్థాయి తెలుగు ప్రతిభా పోటీలను నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ఆర్‌యూపీపీ అధ్యక్షుడు ఎఫ్‌ఎంఎస్ ఖాదర్, గౌరవాధ్యక్షుడు నరసింహారెడ్డి ఆదివారం తెలిపారు.
ఇందుకు సంబంధించి 22వ తేదీన పాఠశాల స్థాయిలో పోటీలు జరిపి ఎంపికైన వారికి 24వ తేదీన మండలస్థాయి పోటీలు నిర్వహించామన్నారు. ఇందులో ప్రథమ, ద్వితీయస్థానాల్లో గెలుపొందిన వారికి 26వ తేదీన డివిజన్‌స్థాయిలో, ఇందులో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన వారికి 29వ తేదీన జిల్లాస్థాయి పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో గెలుపొందిన విద్యార్థులకు నగదు బహుమతి, ప్రశంసాపత్రాలను అందజేస్తామని తెలిపారు.
Kasturba Vidyalayas: కార్పొరేట్ విద్యాసంస్థలతో పోటీ పడుతున్న కస్తూర్బా విద్యాలయాలు