Competitions Results: విద్యార్థులకు నిర్వహించిన పోటీ ఫలితాలు
సాక్షి ఎడ్యుకేషన్: జిల్లా కేంద్రంలోని బుటీగూడ పాఠశాలలో మన ఒడిశా ఆర్గనైజేషన్ తరుపున విద్యార్థులకు వ్యాస రచన, చిత్రలేఖనం, వక్తృత్వ పోటీలను జిల్లా అదనపు కలెక్టర్ వెద్బార్ ప్రధాన్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల్లో ప్రతిభను వెలికి తీసేందుకు ఇటువంటి పోటీలు ఉపయోగపడతాయన్నారు. పోటీల్లో మొత్తం 765 మంది విద్యార్థులు పాల్గొన్నారు. చిత్రలేఖనం పోటీలో స్థానిక ఐఎంఎస్టీ ఇంగ్లిష్ మీడియం పాఠశాలకు చెందిన సరస్మ మహరణ ప్రథమ స్థానంలో, మోడ్రన్ స్కూల్‌కు చెందిన తాపూర్ మల్లిక్ ద్వితీయ స్థానంలో, సాగర్ ముజుందర్ తృతీయ స్థానంలో నిలిచారు.
Consumers Club in Schools: వినియోగదారుల క్లబ్ ఏర్పాట్ల గురించి కలెక్టర్ మాటల్లో
వ్యాస రచనలో సరస్వతీ శిశుమందిర్‌కు చెందిన ప్రియాంకా జైన్ ప్రథమ స్థానం, జాస్మిన్ కోపే ద్వితీయ స్థానం, జగన్నాథ్‌పల్లి పాఠశాలకు చెందిన శాశ్వత్ పండ తృతీయ స్థానంలో నిలిచారు. వక్తృత్వ పోటీల్లో శిశు మందిర్‌కు చెందిన శ్వేతపద్మ నాయిక్ ప్రథమ స్థానంలో, జగ్గన్నాథ్‌పల్లి పాఠశాలకు చెందిన బీనిత్ బిల్వం ద్వితీయ స్థానంలో, శిశుమందిర్‌కు చెందిన లిప్సరాణి పండా తృతియ స్థానంలో నిలిచారు. విజేతలకు ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో విశ్రాంత ఉపాధ్యాయులు ప్రకాష్ చంద్ర పట్నాయక్, విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి రవీంద్ర కుమార్ మహరణ తదితరులు పాల్గొన్నారు.