Best Teacher Awards 2023: బోధనాపరంగా ఉత్తమ సేవలందిస్తున్న ఉపాధ్యాయులకు అవార్డులు
మధురపూడి: జిల్లాలో బోధనాపరంగా ఉత్తమ సేవలందిస్తున్న ఇద్దరు ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర స్థాయి అవార్డులను ప్రకటించింది. వారిలో కోరుకొండ మండలం గాడాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ పిట్టా శిరీష కుమారి ఒకరు. కరోనా సందర్భంలో వీడియోలు ద్వారా వినూత్న పద్ధతుల్లో బోధించినందుకు ఈ అవార్డు దక్కింది. 1998 ఆగస్టు 15న ఈమె గాడాల ఎలిమెంట్రీ స్కూల్లో ఉపాధ్యాయినిగా చేరారు. 2009లో పదోన్నతి పొంది గోకవరం మండలం కామరాజుపేటకు బదిలీ అయ్యారు. అక్కడ ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. 2017లో గాడాల హైస్కూల్‌కు బదిలీపై వచ్చారు. కరోనా సమయంలో విద్యార్థుఽలకు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించారు. ఆన్‌లైన్ ద్వారా బోధిస్తూ విద్యార్థుల్లో ప్రతిభను పెంపొందించారు. యూట్యూబ్ చానెల్ ద్వారా తెలుగు సబ్జెక్టులో పాఠాలను రూపొందించారు. దీక్షా యాప్ ద్వారా ప్రభుత్వానికి బోధనా పద్ధతి వీడియాలను అందజేశారు. 8వ తరగతి పాఠ్యపుస్తక రచనలో పాలు పంచుకున్నారు. ఏపీఈపాఠశాల యాప్‌లో 8,9,5 తరగతులకు వీడియాలు తయారుచేశారు. 32 వీడియోలకు క్వాలిటీ చెక్కర్, రివ్యూవర్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఈ సేవలకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయినిగా ఎంపిక చేసింది.
చదవండి: Best Teacher Awards 2023: ముగ్గురికి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు
ఉత్తమసేవలకు గుర్తింపు
చాగల్లు: చాగల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పి. వీర్రాజు రాష్ట్ర ఉత్తమ ప్రధాన ఉపాధ్యాయునిగా ఎంపికయ్యారు. ఆయన 1996లో ఎస్‌జీటీగా ఉపాధ్యాయ కెరీర్ ప్రారంభించారు. 1997లో స్కూల్ అసిస్టెంట్ (బయాలజి)గా ప్రమోషన్ పొందారు. 2014 నుంచి దేవరపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయునిగా పనిచేశారు. 2021లో సాధరణ బదిలీల్లో భాగంగా చాగల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు హెచ్‌ఎంగా వచ్చారు. అప్పటి నుండి స్థానిక పాఠశాలలో సేవా కార్యక్రమాలతో పాటు నాడు–నేడు పనుల నిర్వహణ, ఎన్‌సీసీ క్యాంపులు, విద్యార్ధులను క్రీడల్లో ప్రోత్సహించడం, ఉత్తీర్ణత శాతాన్ని పెంపొందించడంలో మంచి భూమిక పోషించారు. 2005లో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయడుగా అవార్డు స్వీకరించారు. ఈ ఈ ఏడాది ఉత్తమ ప్రధానోపాధ్యాయునిగా ప్రభుత్వం వీర్రాజును ఎంపిక చేసింది. ఈ సందర్భంగా ఆయన్ను సహచర ఉపాధ్యాయులు అభినందించారు.