Sports Competitions: క్రీడాపోటీల్లో బీసీ గురుకుల విద్యార్థుల సత్తా
అశ్వారావుపేటరూరల్: జిల్లా స్థాయి క్రీడాపోటీల్లో అశ్వారావుపేటలోని బీసీ బాలుర గురుకుల పాఠశాల విద్యార్థులు సత్తాచాటారు. రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించారు. ఈ సందర్భంగా విజేతలను గురువారం ప్రిన్సిపాల్ కె.మంజుల అభినందించి మాట్లాడారు. గత నెల 21నుంచి 23వ తేదీ వరకు, ఈ నెల 2నుంచి 4వ తేదీ వరకు రెండు విడతల్లో జరిగిన జిల్లా స్థాయి స్పోర్ట్ మీట్‌ల వివిధ విభాగాల్లో అశోక్, చరణ్‌తేజ్, సందీప్, తేజరెడ్డి, కె.రోహిత్, హర్షనాయక్ ప్రతిభ కనబర్చి అథ్లెటిక్స్ ఓవరాల్ చాంపియన్ షిప్ సాధించారని తెలిపారు. రాష్ట్ర స్థాయి పోటీలకు అశోక్, కార్తీక్, చరణ్ తేజ, ధీరజ్, కె.రోహిత్, హర్షనాయక్, తరుణ్, శివం ఎంపిక కాగా, విద్యార్థులతో పాటు పీఈటీ టి.వసంత్‌ను ఆమె అభినందించారు.
చదవండి: Telangana: సర్కార్‌బడుల్లో ‘అల్పాహారం’.. టిఫిన్లు ఇవే..
బాలికా విద్యకు ప్రాధాన్యం ఎమ్మెల్యే వనమా
సూపర్‌బజార్(కొత్తగూడెం): బాలికా విద్యకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తెలిపారు. కలెక్టరేట్‌లో గురువారం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థినులకు ఆయన సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రవాణా సదుపాయం లేక పాఠశాలలకు తరచూ గైర్హాజరు కావడం వల్ల కొందరు చదువులో వెనుకబడుతున్నారని తెలిపారు. ఈ సమస్యను గుర్తించిన ప్రభుత్వం బాలికలకు సైకిళ్లు పంపిణీ చేయాలని నిర్ణయిచిందన్నారు. మారుమూల మండలాలైన గుండాల, ఆళ్లపల్లి, కరకగూడెం, పినపాక, చర్ల, దుమ్ముగూడెం, అశ్వారావుపేట మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో మూడు కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం నుంచి పాఠశాలలకు వస్తున్న 200 మంది విద్యార్థినులకు రూ.15 లక్షల విలువైన సైకిళ్లను అందించారు. డీఈఓ వెంకటేశ్వరాచారి, అధికారులు ఎ.నాగరాజశేఖర్, ఎస్‌కె సైదులు తదితరులు పాల్గొన్నారు.