Skip to main content

AISSEE 2023 : సైనిక్‌ స్కూల్స్‌లో ప్ర‌వేశాల‌కు నోటిఫికేష‌న్‌.. ఇలా చేస్తే ప్ర‌వేశం ఈజీనే..

స్కూల్‌ స్థాయి నుంచే సైన్యంలో చేరేలా సన్నద్ధం చేసే వేదికలు.. సైనిక్‌ స్కూల్స్‌! భావి భారత పౌరులు భద్రతా దళాల్లో అడుగుపెట్టి.. దేశ సేవ చేసేలా బడిలోనే శిక్షణ ఇస్తాయి.. సైనిక పాఠశాలలు! అందుకే సైనిక్‌ స్కూల్స్‌లో తమ పిల్లలను చేర్పించాలని ఎంతో మంది తల్లిదండ్రులు ఆశిస్తుంటారు !
aissee 2023
AISSEE 2023 Notification

2023–24 విద్యా సంవత్సరానికి దేశవ్యాప్తంగా ఉన్న సైనిక్‌ స్కూల్స్‌లో.. ఆరు, తొమ్మిదో తరగతిల్లో ప్రవేశాల కోసం ఆల్‌ ఇండియా సైనిక్‌ స్కూల్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (ఏఐఎస్‌ఎస్‌ఈఈ–2023) నోటిఫికేషన్‌ వెలువడింది. ఈ నేపథ్యంలో.. సైనిక్‌ స్కూల్స్‌ ప్రాధాన్యత, ప్రవేశ పరీక్ష విధానం, మంచి మార్కుల సాధనకు ప్రిపరేషన్‌ తదితర వివరాలతో ప్రత్యేక కథనం మీకోసం.. 

త్రివిధ దళాల్లో వారు చేరేలా..

sainik schools


సైనిక్‌ స్కూల్స్‌.. దాదాపు అయిదు దశాబ్దాల క్రితం ఏర్పాటైన విద్యా సంస్థలు. వీటి పర్యవేక్షణకు.. రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా సైనిక్‌ స్కూల్‌ సొసైటీని నెలకొల్పారు. ఈ స్కూల్స్‌ ఆరో తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యా బోధన సాగిస్తున్నాయి. చదువుతోపాటు విద్యార్థులకు ధైర్య సాహసాలు నూరిపోస్తూ.. త్రివిధ దళాల్లో వారు చేరేలా శిక్షణ ఇస్తున్నాయి. 

దేశవ్యాప్తంగా 33 స్కూళ్లలో ప్ర‌వేశం ..

sainik schools admissions in india

➤ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ప్రత్యక్ష పర్యవేక్షణలో 33 సైనిక పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ఆరో తరగతిలో 2,894 సీట్లు, తొమ్మిదో తరగతిలో 379 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటితోపాటు 2023–24 విద్యా సంవత్సరం నుంచి పీపీపీ విధానంలో కొత్తగా మరో 18 సైనిక్‌ స్కూల్స్‌ ప్రారంభిస్తున్నారు. వీటిలో 1,590 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
➤ అదే విధంగా 2023–24 విద్యా సంవత్సరం నుంచి ఆరో తరగతిలో అమ్మాయిలకు కూడా ప్రవేశాలు కల్పించాలని నిర్ణయించారు. ప్రతి సైనిక్‌ స్కూల్‌లో 10 సీట్లను విద్యార్థినులకు కేటాయించారు. తొమ్మిదో తరగతికి మాత్రం పురుష అభ్యర్థులనే అర్హులుగా పేర్కొన్నారు.
➤ ఆంధ్రప్రదేశ్‌లో కోరుకొండ సైనిక్‌ స్కూల్‌లో ఆరో తరగతిలో 68 సీట్లు, తొమ్మిదో తరగతిలో 22 సీట్లు, కలికిరిలో ఆరో తరగతిలో 70 సీట్లు, తొమ్మిదో తరగతిలో 30 సీట్లు ఉన్నాయి.
➤ పీపీపీ విధానంలో.. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నంలో అదానీ వరల్డ్‌ స్కూల్‌ అందుబాటులోకి రానుంది. ఇందులో మొత్తం 50 సీట్లు ఉన్నాయి.
➤ ఏపీలోని సైనిక్‌ స్కూల్స్‌కు ఏపీ, తెలంగాణ విద్యార్థులు పోటీ పడొచ్చు.

అర్హతలు ఇవే..
☛ ఆరో తరగతిలో ప్రవేశానికి ప్రస్తుతం ఏదైనా పాఠశాలలో ఐదో తరగతి చదువుతుండాలి. మార్చి 31, 2023 నాటికి 10 నుంచి 12ఏళ్ల మధ్య ఉండాలి. ☛ తొమ్మిదో తరగతిలో చేరాలనుకుంటున్న విద్యార్థులు ప్రస్తుతం ఎనిమిదో తరగతి చదువుతుండాలి. మార్చి 31, 2023 నాటికి 13 నుంచి 15 ఏళ్ల మధ్యలో ఉండాలి.

రాత పరీక్ష ఇలా..

sainik schools exam system

☛ ప్రభుత్వ సైనిక్‌ స్కూల్స్‌తోపాటు, పీపీపీ విధానంలోని సైనిక పాఠశాలల్లో ఆరు, తొమ్మిదో తరగతిలో ప్రవేశాలకు జాతీయ స్థాయిలో నిర్వహించే పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా విద్యార్థులకు సీట్లు ఖరారు చేస్తారు. 
☛ ఎన్‌టీఏ ఆధ్వర్యంలో ఆల్‌ ఇండియా సైనిక్‌ స్కూల్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ను నిర్వహిస్తారు. ఈ పరీక్ష ఆరు, తొమ్మిది తరగతులకు వేర్వేరుగా ఉంటుంది. 
☛ ఏఐఎస్‌ఎస్‌ఈఈలో సాధించిన ప్రతిభ, విద్యార్థులు దరఖాస్తు సమయంలో పేర్కొన్న పాఠశాలల ప్రాథమ్యాల ఆధారంగా మెరిట్‌ జాబితా రూపొందించి ప్రవేశం ఖరారు చేస్తారు.

ఆరో తరగతి పరీక్ష విధానం ఇదే..
సైనిక్‌ స్కూల్స్‌లో ఆరో తరగతిలో ప్రవేశానికి మొత్తం 300 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో 125 ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష వ్యవధి రెండున్నర గంటలు. నాలుగు విభాగాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. లాంగ్వేజ్‌ 25 ప్రశ్నలు–50 మార్కులు, మ్యాథమెటిక్స్‌ 50 ప్రశ్నలు–150 మార్కులు, ఇంటెలిజెన్స్‌ 25 ప్రశ్నలు–50 మార్కులు, జనరల్‌ నాలెడ్జ్‌ 25 ప్రశ్నలు–50 మార్కులకు ప్రశ్న పత్రం ఉంటుంది. మ్యాథమెటిక్స్‌ విభాగంలో ఒక్కో ప్రశ్నకు మూడు మార్కులు, మిగతా విభాగాల్లో ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు కేటాయించారు.

సబ్జెక్ట్ ప్రశ్నలు,మార్కులు మొత్తం మార్కులు పరీక్షామయం(నిమిషాల్లో)
మ్యాథ్స్ 50x3 150 60
జనరల్ నాలెడ్జ్ 25x2 50 30
లాంగ్వేజ్ 25x2 50 30
ఇంటెలిజెన్స్ 25x2 50 30
మొత్తం 125 ప్రశ్నలు 300 150

తొమ్మిదో తరగతి పరీక్ష మాత్రం..

sainik school 6th class admissions

తొమ్మిదో తరగతి ప్రవేశ పరీక్షను మొత్తం నాలుగు వందల మార్కులకు అయిదు విభాగాల్లో నిర్వహిస్తారు. ఇందులో 150 ప్రశ్నలు అడుగుతారు. మ్యాథమెటిక్స్‌ 50 ప్రశ్నలు–200 మార్కులకు, ఇంటెలిజెన్స్‌ 25 ప్రశ్నలు–50 మార్కులకు, ఇంగ్లిష్‌ 25 ప్రశ్నలు–50 మార్కులకు, జనరల్‌ సైన్స్‌ 25 ప్రశ్నలు–50 మార్కులకు, సోషల్‌ సైన్స్‌ 25 ప్రశ్నలు–50 మార్కులకు ప్రశ్న పత్రం ఉంటుంది. n మ్యాథమెటిక్స్‌ విభాగంలో ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కులు, మిగతా విభాగాల్లో ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు కేటాయించారు. పరీక్ష వ్యవధి మూడు గంటలు.

సబ్జెక్ట్ {పశ్నలు,మార్కులు మొత్తం మార్కులు పరీక్షామయం(నిమిషాల్లో)
మ్యాథ్స్ 50 x4 200 60
ఇంగ్లిష్ 25x2 50 30
ఇంటెలిజెన్స్ 25x2 50 30
జనరల్ సైన్స్ 25x2 50 30
సోషల్ స్టడీస్ 25x2 50 30
మొత్తం 150 ప్రశ్నలు 400 మార్కులు 180 నిమిషాలు

ఆఫ్‌లైన్‌ విధానంలో పరీక్ష :
☛ ఈ రెండు పరీక్షలు ఆఫ్‌లైన్‌ విధానంలోనే జరుగుతాయి. 
☛ అభ్యర్థులు ఓఎంఆర్‌ షీట్‌లో సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది.
☛ ఆరో తరగతి ప్రవేశ పరీక్షను ఇంగ్లిష్, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మళయాలం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూ భాషల్లో నిర్వహిస్తారు. అభ్యర్థులు తమకు నచ్చిన భాషలో పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల విద్యార్థులు తెలుగు, ఉర్దూ మీడియంలను ప్రాంతీయ భాషలుగా పేర్కొని పరీక్ష రాసే అవకాశం ఉంది.
☛ తొమ్మిదో తరగతి ప్రవేశ పరీక్షను మాత్రం ఇంగ్లిష్‌ మాధ్యమంలోనే నిర్వహిస్తారు.

హోంస్టేట్‌ కోటా విధానం ఇలా.. :
☛ సైనిక్‌ స్కూల్స్‌ ప్రవేశాల్లో హోంస్టేట్‌ కోటా విధానాన్ని అమలు చేస్తున్నారు. 
☛ సదరు సైనిక్‌ స్కూల్‌ ఏర్పాటైన రాష్ట్రానికి చెందిన విద్యార్థులకు ఆ పాఠశాలలో ఉన్న మొత్తం సీట్లలో 67 శాతం సీట్లను సొంత రాష్ట్రానికి చెందిన వారికి కేటాయిస్తారు. మిగతా 33 శాతం సీట్లను అదర్‌ స్టేట్‌ కోటా పేరుతో అన్ని రాష్ట్రాల విద్యార్థులకు కేటాయిస్తారు.
☛ హోంస్టేట్, అదర్‌ స్టేట్‌ కోటాల్లో అందుబాటులో ఉండే సీట్లలో 25 శాతం సీట్లను త్రివిధ దళాల్లో విధులు నిర్వహిస్తున్న వారి పిల్లలకు కేటాయిస్తారు.

మంచి మార్కులు సాధించాలంటే..?

sainik schools admissions 2022

☛ విద్యార్థులు ముందుగా తాము దరఖాస్తు చేసుకుంటున్న తరగతి ఆధారంగా అంతకుముందు తరగతులకు సంబంధించి అకాడమీ పుస్తకాలు, ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలను అధ్యయనం చేయాలి. 
☛ ఆరో తరగతి ప్రవేశ పరీక్ష అభ్యర్థులు ప్రధానంగా నాలుగు, అయిదు తరగతుల మ్యాథమెటిక్స్, ఇంగ్లిష్‌ పుస్తకాలను చదవాలి. 
☛ తొమ్మిదో తరగతి అభ్యర్థులు అయిదు నుంచి ఎనిమిది తరగతుల పుస్తకాలను ముఖ్యంగా మ్యాథమెటిక్స్, జనరల్‌ సైన్స్‌ అంశాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలి.
☛ ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌కు సంబంధించి గ్రామర్‌పై పట్టు సాధించాలి. ముఖ్యంగా యాంటానిమ్స్, సినానిమ్స్, ఆర్టికల్స్, ప్రిపొజిషన్స్, వెర్బ్స్‌పై దృష్టి పెట్టాలి.
☛ జనరల్‌ సైన్స్‌కు సంబంధించి సైన్స్‌లోని ప్రాథమిక అంశాలు, మొక్కలు, బ్యాక్టీరియాలు, వ్యాధులు–కారకాలు తదితర అంశాలపై పట్టు సాధించాలి.
☛ సోషల్‌ సైన్స్‌లో పర్యావరణం, హిస్టరీ, జాగ్రఫీ అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. అదే విధంగా సివిక్స్‌కు సంబంధించిన ప్రాథమిక భావనలు తెలుసుకోవాలి.
☛ ఎకనామిక్స్‌లో జనాభా, జన గణన గణాంకాలు, పంటలు–ఉత్పత్తులు, అవి ఎక్కువగా పండే ప్రదేశాలు తదితర అంశాలపై అవగాహన పెంచుకోవాలి.
☛ జనరల్‌ నాలెడ్జ్‌లో ముఖ్యమైన వ్యక్తులు,అవార్డులు–విజేతలు,ముఖ్యమైన ప్రదేశాలు,క్రీడలు–విజేతలు, ప్రధానమంత్రులు, రాష్ట్రపతి వంటి పదవులు చేపట్టిన వ్యక్తుల గురించి తెలుసుకోవాలి.
☛ అకడమిక్‌ పుస్తకాలు, జనరల్‌ నాలెడ్జ్‌ అంశాలను చదువుతూ ప్రిపరేషన్‌ సాగిస్తే.. పరీక్షలో మంచి మార్కులు సాధించి సీటు పొందే అవకాశాలను మెరుగుపరచుకోవచ్చు.

భద్రతా దళాల్లో.. సైనిక్‌ స్కూల్స్‌ విద్యార్థులు..

indian defence

సైనిక్‌ స్కూల్స్‌ అందించే శిక్షణ ఫలితంగా.. ఈ పాఠశాలల నుంచి త్రివిధ దళాల్లో చేరే వారి సంఖ్య కొంత ఎక్కువగా ఉంటోందని చెప్పొచ్చు. ఎన్‌డీఏ పరీక్ష ద్వారా ప్రతి ఏటా ఎంపికయ్యే వారిలో 30 శాతం వరకు సైనిక్‌ స్కూళ్ల విద్యార్థులే ఉంటున్నారు. స్కూల్‌ స్థాయి నుంచే శిక్షణనివ్వడం, ఎన్‌సీసీ, ఇతర ఫిజికల్‌ ట్రైనింగ్‌ యాక్టివిటీస్‌ ఇందుకు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి.

ముఖ్య సమాచారం ఇదే.. :
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: నవంబర్‌ 30, 2022
ఏఐఎస్‌ఎస్‌ఈఈ పరీక్ష తేదీ: జనవరి 8, 2023 
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: అనంతపురం, గుంటూరు, కడప, కర్నూలు, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, కరీంనగర్‌
వెబ్‌సైట్‌: https://aissee.nta.nic.in, www.nta.ac.in

Published date : 03 Nov 2022 07:01PM

Photo Stories