ఏపీ పీజీ ఈసెట్-2020 ఫలితాలు విడుదల..వీరికి మళ్లీ పరీక్ష
Sakshi Education
సాక్షి, విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ పీజీ ఈసెట్ 2020 ఫలితాలు విడుదలయ్యాయి. అక్టోబర్ 23వ తేదీన ఏయూ ఉప కులపతి ఆచార్య పీవీ జీడీ ప్రసాద్ రెడ్డి ఫలితాలను విడుదల చేశారు.
ఎంటెక్, ఎంఫార్మసీ ప్రవేశాలకు 28,868 మంది అభ్యర్థులు రిజిస్టర్ చేసుకున్నారు. 22,911 మంది హాజరయ్యారు. 20,157 మంది అర్హులయ్యారు. 42 సెంటర్లలో ఈ టెస్ట్ నిర్వహించాం. మొత్తం 87.98 శాతం మంది అర్హులయ్యారు. ఎంటెక్‌కు 17,150 మంది హాజరు కాగా, 14,775 మంది అర్హత సాధించారు. ఫార్మసీ పరీక్షలకు 5,761 మంది హాజరు కాగా 5,382 మంది అర్హత సాధించారు. ఎంఫార్మసీ అడ్మిషన్స్ కూడా ఆన్‌లైన్‌లో నిర్వహిస్తామని వీసీ తెలిపారు. ఆంధ్ర యూనివర్సిటీ ఈ అడ్మిషన్ ప్రక్రియ నిర్వహిస్తోంది. అలాగే కోవిడ్ వల్ల ఈ పరీక్షలకు హజరు కాలేని వారికి మరో సారి పరీక్ష నిర్వహిస్తున్నాము. కోవిడ్ కారణంగా దూరంగా ఉన్న విద్యార్థుల కోసం రెండవ సారి ఎంట్రన్స్ నిర్వహించమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారని తెలిపారు.
Published date : 23 Oct 2020 01:05PM