CPGET-2023: నేడే సీపీజీఈటీ-2023 ఫలితాల విడుదల... ఫలితాల కోసం సాక్షిఎడ్యుకేషన్.కామ్ క్లిక్ చేయండి
ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి చేతుల మీదుగా మధ్యాహ్నం మూడున్నర గంటలకు ఫలితాలను విడుదల చేస్తామని పేర్కొన్నారు. పీజీకి సంబంధించిన పలు కోర్సులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీపీజీఈటీ పేరుతో కామన్ ఎంట్రన్స్ నిర్వహిస్తోంది.
ఇవీ చదవండి: ఇన్ఫోసిస్‌లో ఆఫీసుబాయ్... కట్ చేస్తే ఇప్పుడు రెండు కంపెనీలకు సీఈఓ... పీఎం మోదీ నుంచి ప్రశంసలు.!
ఈ పరీక్షలో వచ్చిన ర్యాంక్ ఆధారంగా రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, మహాత్మా గాంధీ, పాలమూరు, జేఎన్టీయూ, శాతవాహన యూనివర్సిటీలు, వాటి అనుబంధ కాలేజీల్లో ప్రవేశం కల్పిస్తారు. జూన్ 30 నుంచి జూలై 10 వరకు ఆన్లైన్ విధానంలో ప్రవేశ పరీక్షలు నిర్వహించారు. మూడు సెషన్లతో తొమ్మిది రోజుల పాటు నిర్వహించిన పరీక్షల్లో
60,443 మంది హాజరయ్యారు.
ఇవీ చదవండి: బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితా ఇదే..!
అభ్యర్థలు తమ ఫలితాలను సాక్షి ఎడ్యుకేషన్.కామ్‌లో చెక్ చేసుకోవచ్చు.
► https://www.sakshieducation.com సందర్శించండి.
► హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న టీఎస్ సీపీజీఈటీ 2023 రిజల్ట్స్ లింక్‌పై క్లిక్ చేయండి.
► మీ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి.
► మీ ఫలితాలను అక్కడే చూసుకోవచ్చు.
► తదుపరి రిఫరెన్స్ కోసం కాపీని డౌన్ లోడ్ చేసుకోండి.