Skip to main content

APPSC Group 1 Final Results 2023: 1, 2, 3 ర్యాంకులు అమ్మాయిల‌వే.. టాప్ 10లో ఆరుగురు వీరే..!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిషన్ నిర్వ‌హించిన‌ గ్రూప్‌-1 పరీక్ష తుది ఫలితాలు విడుద‌ల‌య్యాయి. విజయవాడలో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో క‌మిష‌న్‌ చైర్మన్‌ గౌతం సవాంగ్‌ ఫలితాలను ప్ర‌క‌టించారు. మొత్తం 110 పోస్టుల‌కు అర్హ‌త సాధించిన అభ్య‌ర్థుల వివ‌రాల‌ను వెల్ల‌డించారు.
APPSC Chairman Gautam Sawang, Group 1 exam Result.
గ్రూప్ 1 తుది ఫ‌లితాలు విడుద‌ల‌... టాప‌ర్స్ వీరే..!

టాప్‌ ప‌దిస్థానాల్లో ఆరుగురు మహిళ‌లే ఉండ‌డం విశేషం. టాప్ 5లో ఇద్ద‌రు అనంత‌పురం వాసులే. 

టాప‌ర్ల వివ‌రాలు ఇలా ఉన్నాయి... 
ఫ‌స్ట్ ర్యాంకు - భానుశ్రీ ల‌క్ష్మీ(బీఏ ఎక‌నామిక్స్ - ఢిల్లీ యూనివ‌ర్సిటీ)
సెకండ్ ర్యాంకు - భూమిరెడ్డి భ‌వాని (అనంత‌పురం)
మూడో ర్యాంకు - కంబాల‌కుంట ల‌క్ష్మీప్ర‌స‌న్న‌
నాలుగో ర్యాంకు - ప్ర‌వీణ్‌కుమార్ రెడ్డి(అనంత‌పురం జేఎన్‌టీయూ)
ఐదో ర్యాంకు - భానుప్ర‌కాష్ రెడ్డి (క‌`ష్ణా యూనివ‌ర్సిటీ)

ఇవీ చ‌ద‌వండి: ఈ చాన్స్ మిస్ చేసుకోకండి... మీరు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారా..?

Exams

2022 సెప్టెంబర్ 30 న ఏపీపీఎస్సీ 110 గ్రూప్ 1 పోస్టుల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. జనవరి 8వ తేదీన నిర్వ‌హించిన‌ ప్రిలిమ్స్ ప‌రీక్ష‌కు దాదాపు 85 వేల మంది హాజ‌ర‌య్యారు. ప‌రీక్ష ముగిస‌న అనంత‌రం కేవ‌లం 19 రోజుల్లోనే ఫ‌లితాల‌ను క‌మిష‌న్ వెల్ల‌డించింది. జనవరి 27న విడుద‌ల చేసిన‌ ప్రిలిమ్స్ ఫలితాల్లో 6,455 మంది మెయిన్స్‌కు అర్హత సాధించారు.

ఇవీ చ‌ద‌వండి: సెప్టెంబ‌ర్ 1 నుంచి ఖమ్మంలో అగ్నివీర్ నియామక ర్యాలీ... ఈ డాక్యుమెంట్లు లేక‌పోతే ఇంటికే..!

జూన్‌ 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు మెయిన్స్‌ పరీక్షల‌ను ఏపీపీఎస్సీ నిర్వ‌హించింది. 110 పోస్టుల‌కు 1:2 నిష్ప‌త్తిలో అభ్య‌ర్థుల‌ను ఇంట‌ర్వ్యూల‌కు ఎంపిక చేసింది. మెయిన్స్‌కు అర్హ‌త సాధించిన 220 మంది అభ్య‌ర్థుల‌కు ఆగస్ట్ 2వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. అనంత‌రం ఈరోజు తుది ఫ‌లితాల‌ను ఏపీపీఎస్సీ వెల్ల‌డించింది. నోటిఫికేష‌న్ విడుద‌ల నుంచి ఫ‌లితాల వెల్ల‌డి వ‌రకు పూర్తి పారదర్శకత పాటించిన ఏపీపీఎస్సీ.. అతి తక్కువ సమయంలో వివాదాలకి దూరంగా ప్రక్రియను పూర్తి చేసింది. 

Published date : 18 Aug 2023 10:59AM

Photo Stories