యూపీఎస్సీ క్యాలెండర్-2020
Sakshi Education
భారత అత్యున్నత నియామక సంస్థ.. ఉద్యోగార్థులకు ఆశాదీపిక.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ)! జాతీయ స్థాయిలో ఏటా సివిల్స్‌పాటు పలు కేంద్ర సర్వీసులకు నియామక పరీక్షలు నిర్వహిస్తోంది. ఆయా పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల సంఖ్య లక్షల్లోనే! ఈ నేపథ్యంలో యూపీఎస్సీ విధులు, నిర్వహిస్తున్న పరీక్షలతోపాటు 2020 సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ వివరాలు...
రాజ్యాంగంలోని ఆర్టికల్ 315 కేంద్రంతోపాటు, రాష్ట్రాలకు ప్రత్యేక పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లు ఉండాలని పేర్కొంటోంది. ఆర్టికల్ 316 నుంచి 323 వరకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల నియామకం, విధులు, ఖర్చులు, అధికారాలు, సభ్యుల తొలగింపు తదితరాల గురించి పేర్కొంటున్నాయి.
విధులు :
క్యాలెండర్-2020 :
విధులు :
- యూనియన్ సర్వీసు నియామకాలకు సంబంధించిన పరీక్షల నిర్వహణ. ఇంటర్వ్యూల ద్వారా కొలువుల భర్తీ.
- ఎంపిక చేసిన వారితోపాటు ప్రమోషన్, డిప్యుటేషన్‌లపై నియామకాలు చేపట్టడం.
- కేంద్రప్రభుత్వ పరిధిలోని వేర్వేరు కొలువుల భర్తీకి సంబంధించిన నియమ నిబంధనల రూపకల్పన.
- పౌర సర్వీసులకు సంబంధించి డిసిప్లినరీ కేసుల పరిశీలన.
- రాష్ర్టపతి కమిషన్‌కు సిఫారుసు చేసిన అంశాలపై ప్రభుత్వానికి సలహాలు అందించడం.
- యూపీఎస్పీ సంవత్సరం పొడవునా వివిధ పరీక్షలను నిర్వహిస్తోంది.
క్యాలెండర్-2020 :
- ఇంజనీరింగ్ సర్వీసెస్(ప్రిలిమినరీ) ఎగ్జామినేషన్ -2020, నోటిఫికేషన్ సెప్టెంబర్ 25, 2019న వెలువడనుంది. దరఖాస్తుకు చివరితేదీ అక్టోబర్ 15. పరీక్ష తేదీ జనవరి 5, 2020.
- కంబైన్డ్ జియో సైంటిస్ట్(ప్రిలిమినరీ) ఎగ్జామినేషన్-2020, నోటిఫికేషన్ సెప్టెంబర్ 25, 2019న వెలువడనుంది. దరఖాస్తుకు చివరితేదీ అక్టోబర్ 15. పరీక్ష తేదీ జనవరి 19, 2020.
- సీడీఎస్ ఎగ్జామినేషన్(I)- 2020, నోటిఫికేషన్ అక్టోబర్ 30, 2019న వెలువడనుంది. దరఖాస్తుకు చివరితేదీ నవంబర్ 19. పరీక్ష తేదీ ఫిబ్రవరి 2, 2020.
- సీఐఎస్‌ఎఫ్ ఏసీ(ఎక్స్) ఎల్‌డీసీఈ- 2020, నోటిఫికేషన్ డిసెంబర్ 4, 2019న వెలువడనుంది. దరఖాస్తుకు చివరితేదీ డిసెంబర్ 24. పరీక్ష తేదీ మార్చి 1, 2020.
- ఎన్‌డీఏ,ఎన్‌ఏ ఎగ్జామినేషన్(I)- 2020, నోటిఫికేషన్ జనవరి 8, 2020న వెలువడనుంది. దరఖాస్తుకు చివరితేదీ జనవరి 28.. పరీక్ష తేదీ ఏప్రిల్ 19.
- సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్(సంయుక్త)- 2020, నోటిఫికేషన్ ఫిబ్రవరి 12, 2020న వెలువడనుంది. దరఖాస్తుకు చివరితేదీ మార్చి 3. పరీక్ష తేదీ మే 31, 2020.
- ఇండియన్ ఎకనామిక్ సర్వీస్/ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్-2020, నోటిఫికేషన్ మార్చి 25, 2020న వెలువడనుంది. దరఖాస్తుకు చివరి తేది ఏప్రిల్ 13,2020. కాగా, పరీక్ష.. జూన్ 26 నుంచి మూడు రోజుల పాటు జరుగనుంది.
- కంబైన్డ్ జియో సైంటిస్ట్(మెయిన్)ఎగ్జామినేషన్- 2020, జూన్ 27, 2020 నుంచి రెండు రోజులపాటు జరగనుంది. ఇంజనీరింగ్ సర్వీసెస్(మెయిన్) ఎగ్జామినేషన్-2020, జూన్ 28న జరగనుంది.
- కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్- 2020, నోటిఫికేషన్ ఏప్రిల్ 8, 2020న వెలవడనుంది. దరఖాస్తుకు చివరితేదీ ఏప్రిల్ 28 కాగా, పరీక్ష తేదీ జూలై 19.
- సెంట్రల్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్(ఏసీస్) ఎగ్జామినేషన్, 2020 నోటిఫికేషన్ ఏప్రిల్ 22న వెలువడనుంది. దరఖాస్తుకు చివరితేదీ మే 12. కాగా పరీక్ష తేదీ ఆగస్టు 9, 2020.
- ఎన్‌డీఏ, ఎన్‌ఏ ఎగ్జామినేషన్(II)- 2020, నోటిఫికేషన్ జూన్ 10, 2020న వెలువడనుంది. దరఖాస్తుకు చివరితేదీ జూన్ 30, పరీక్ష తేదీ సెప్టెంబర్ 6.
- సివిల్ సర్వీసెస్ మెయిన్ ఎగ్జామినేషన్-2020, సెప్టెంబర్ 18, 2020 నుంచి ఐదు రోజులపాటు జరగనుంది.
- సీడీఎస్ ఎగ్జామినేషన్(II)-2020 నోటిఫికేషన్ ఆగస్టు 5, 2020న వెలువడనుంది. దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్టు 25, పరీక్ష తేదీ నవంబర్ 8.
Published date : 14 Sep 2019 06:04PM