సివిల్స్ మోడల్ పేపర్లను ప్రాక్టీస్ చేయడం ఎంతో ముఖ్యం.. !
Sakshi Education
ఇప్పుడు కొత్త విషయాలను చదవడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు.
ప్రస్తుత సమయంలో జనరల్ స్టడీస్ పేపర్–1 కాంప్రహెన్సివ్ మోడల్ పేపర్లను సాధన చేయాలి. ముఖ్యంగా వాస్తవ పరీక్ష మాదిరిగా మాస్కు ధరించి పేపర్లను సాధన చేయడం అలవాటు చేసుకోవాలి. మోడల్ పేపర్‌లో చూపిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థి తన ప్రదర్శనను విశ్లేషించుకోవాలి. ఎన్ని ప్రశ్నలకు సరైన సమాధానం రాయగలిగారు? ఎన్ని ప్రశ్నలకు సమాధానాలు అంచనా వేశారు? వాటిలో ఎన్ని సరైనవి? సరికానివి ఎన్ని? అని గుర్తించాలి. ఈ విశ్లేషణ ఆధారంగా పరీక్షలో ఎన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు రాయగలిగే అవకాశం ఉందో ఒక అంచనాకు రావచ్చు. ఈ సంఖ్య పరీక్షలో అడిగే ప్రశ్నల తీరుపై ఆధారపడి ఉన్నప్పటికీ.. ముందస్తు అంచనాకు ఇది దోహదపడుతుంది. జనరల్ స్టడీస్ పేపర్–2 కేవలం అర్హత పరీక్ష మాత్రమే అయినప్పటికీ.. కనీసం ఒక మోడల్ పేపర్‌ను సాధన చేయాలి. దీనిలో కాంప్రహెన్షన్ విభాగాన్ని మొదటగా ప్రారంభించ కుండా.. రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ విభాగాలను ముందుగా ప్రారంభించాలి. ఉదయం, మధ్యాహ్నం పరీక్షల మధ్య విరామ సమయంలో తాజా గాలి లభించే ప్రాంతంలో(మాస్క్ లేకుండా) ఉండాలి.
–వి.గోపాలకృష్ణ, డైరెక్టర్, బ్రెయిన్ ట్రీ అకాడెమీ.
ఇంకా చదవండి: part 6: సివిల్స్ అభ్యర్థులకు విజయంపై విశ్వాసం ఉండాలి!
–వి.గోపాలకృష్ణ, డైరెక్టర్, బ్రెయిన్ ట్రీ అకాడెమీ.
ఇంకా చదవండి: part 6: సివిల్స్ అభ్యర్థులకు విజయంపై విశ్వాసం ఉండాలి!
Published date : 02 Oct 2020 04:04PM