4న సివిల్స్ ప్రిలిమ్స్ ఏగ్జామ్.. సాధించే మార్గాలు ఇవిగో..
Sakshi Education
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష ద్వారా..ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్(ఐఏఎస్), ఇండియన్ పోలీస్ సర్వీస్(ఐపీఎస్), ఇండియన్ ఫారిన్ సర్వీస్(ఐఎఫ్‌ఎస్) వంటి 24 దేశ అత్యున్నత సర్వీసుల్లో చేరడానికి ఏటా లక్షల మంది ప్రతిభావంతులు పోటీపడుతుంటారు.
మూడంచెల్లో జరిగే సివిల్స్ ఎంపిక ప్రక్రియలో.. ప్రిలిమ్స్ పరీక్ష తొలిదశ. దీనిలో విజయం సాధించిన వారే తదుపరి దశ మెయిన్‌కు అర్హత సాధిస్తారు. కొవిడ్ లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడిన ప్రిలిమినరీ పరీక్షను అక్టోబర్ 4న (ఈ నెల) నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో..
సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు చివరి రోజుల్లో అనుసరించాల్సిన ప్రిపరేషన్ వ్యూహాలు.. చేయాల్సిన రివిజన్, మాస్క్‌తో మోడల్ పేపర్ల సాధన, పరీక్ష రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నిపుణుల సలహాలు...
సివిల్స్ 2020 ద్వారా 796 పోస్టులు భర్తీ చేయనున్నారు. సివిల్స్ ఎంపిక ప్రక్రియ తొలిదశ ప్రిలిమ్స్‌లో రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్‌ను 200 మార్కులకు, ఆబ్జెక్టివ్ తరహాలో నిర్వహిస్తారు. ప్రతి పేపర్‌కు పరీక్ష సమయం రెండు గంటలు. ఇందులో పేపర్ 1 అత్యంత కీలకమైంది. ఇందులో సాధించిన మార్కుల ఆధారంగానే రెండో దశ మెయిన్‌కు అర్హత లభిస్తుంది. పేపర్ 2(సీశాట్).. కేవలం అర్హత పరీక్ష మాత్రమే. ఇందులో కనీసం 33 శాతం మార్కులు సాధిస్తే సరిపోతుంది. ప్రశ్నపత్రాలు ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు మార్కు కోత విధిస్తారు.
కరెంట్ అఫైర్స్..

కరెంట్ అఫైర్స్‌కు సంబంధించి ఏడాది, ఏడాదిన్నర నుంచి ముఖ్యమైన అంశాలను రివిజన్ చేసుకోవాలి. సైన్స్ అండ్ టెక్నాలజీ, నాసా, ఇస్రోకు సంబంధించిన చంద్రయాన్, గగన్‌యాన్, లాంచింగ్ వెహికల్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
తదితర కొత్త టెక్నాలజీలపై ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. అంతర్జాతీయ సంబంధాలు, విదేశీ వ్యవహారాలు, కేంద్ర రాష్ట్ర సంబంధాలు–గవర్నర్ పాత్ర, పార్టీ ఫిరాయింపుల చట్టాలు, మనీ బిల్లుతోపాటు ఈ మధ్య కొత్తగా తెచ్చిన చట్టాలు, సవరించిన చట్టాలపై దృష్టి సారించాలి. చరిత్రలో సింధు నాగరికత, ఇటీవల వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సహాయనిరాకరణ ఉద్యమం, 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న రెండో ప్రపంచ యుద్ధంతోపాటు ఖిలాఫత్ ఉద్యమం తదితర అంశాలను పునశ్చరణ చేసుకోవాలి. సిక్కు, బుద్ధిజం సంబంధిత ప్రశ్నలను సాధన చేయాలి. జాగ్రఫీలో ముఖ్యంగా చివరి క్షణంలో రివిజన్ చేయాల్సిన అంశం మ్యాప్ పాయింటింగ్. గల్ఫ్ దేశాలు, మధ్య ఆసియా దేశాలు, మధ్యధరా సముద్రం చుట్టు పక్కల దేశాలు, పసిఫిక్ దీవులు వంటి వాటిని ముఖ్యంగా రివిజన్ చేసుకోవాలి. ఇటీవల సంభవించిన మిడతల దండు, అమెజాన్ ఫారెస్ట్ ఫైర్, ఆస్ట్రేలియా బుష్ ఫైర్స్, తుఫానులు తదితర విపత్తులపై ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. వివిధ రకాల సూచికలు, సైనిక వ్యాయామాలు, నౌకాదళ విన్యాసాల గురించి మననం చేసుకోవాలి.
ఇంకా చదవండి: part 2: సివిల్స్ సాధించేందుకు ముఖ్యమైన క్వాలిటీ.. పునశ్చరణ!

Published date : 02 Oct 2020 03:57PM